Vijay Devarakonda: రెస్ట్ మోడ్‌లో రౌడీ హీరో.. అంతా కరోనా పుణ్యమే!

విజయ్ దేవరకొండ చిల్ అవుతున్నాడు.. మొన్నటి వరకూ దెబ్బలు తిని ఒళ్లు హూనం చేసుకున్న ఈ రౌడీ హీరో ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాడు. సెకండ్ వేవ్ తర్వాత లేట్ గా షూటింగ్ మొదలుపెట్టిన లైగర్..

Vijay Devarakonda: రెస్ట్ మోడ్‌లో రౌడీ హీరో.. అంతా కరోనా పుణ్యమే!

Vijay Devarakonda

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చిల్ అవుతున్నాడు.. మొన్నటి వరకూ దెబ్బలు తిని ఒళ్లు హూనం చేసుకున్న ఈ రౌడీ హీరో ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాడు. సెకండ్ వేవ్ తర్వాత లేట్ గా షూటింగ్ మొదలుపెట్టిన లైగర్.. బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో బిజీ అయ్యాడు. మళ్లీ థర్డ్ వేవ్ వచ్చేసరికి తప్పనిసరై ఇంట్లో కూర్చోవాల్సొచ్చిందటున్నాడు విజయ్. విజయ్ దేవరకొండ.. ప్రజెంట్ హాట్ హాట్ సేలబుల్ హీరో. తెలుగు నుంచి హిందీ వరకూ అందరూ ఫిదా అయిపోతున్న హీరో. ఈ రౌడీ హీరో ప్రజెంట్ చిల్ మూడ్ లో ఉన్నాడు.

Shyam Singha Roy: ఓటీటీలో శ్యామ్ సింగరాయ్.. ఎప్పుడంటే?

మొన్నటి వరకూ బ్యాక్ టూ బ్యాక్ షూట్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు షూట్ బ్రేక్ దొరికింది. ఇక కొన్నాళ్లు రెస్టే అంటూ ఇంట్లో ఫోటోలు పోస్ట్ చేశాడు. ప్రజెంట్ విజయ్ లైగర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కోవిడ్ వల్ల సెకండ్ వేవ్ తో షూటింగ్ కి లాంగ్ గ్యాప్ వచ్చేసింది. కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో గ్రాండ్ గా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ముంబై, గోవా, అమెరికాలో షూట్ చేశారు. అయితే ప్రజెంట్ కోవిడ్ విపరీతంగా పెరగడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది టీమ్.

Film Celebrities: సెలబ్రిటీలను చుట్టేస్తున్న కరోనా.. ఉదృతంగా వ్యాప్తి!

సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టిన లైగర్ మూవీ నాన్ స్టాప్ గా షూట్ చెయ్యడంతో విపరీతంగా స్ట్రెయిన్ అయ్యానని సోషల్ మీడియాలో అప్పట్లో ఫోటోలు షేర్ చేసుకున్నారు విజయ్. కానీ ఇప్పుడు బ్రేక్ దొరకడంతో ఇంటికొచ్చి చిల్ అవుతున్నారు. అంతేకాదు.. ఈ బ్రేక్ లో బాలయ్య బాబు అదరగొడుతున్న అన్ స్టాపబుల్ సూపర్ హిట్ షోకి కూడా గెస్ట్ గా అటెండ్ అయ్యాడు విజయ్. ఇలా పిల్లలకు సంక్రాంతి హాలీడేస్ ఎలానో.. నాకు అలా షూట్ బ్రేక్ తో హాలిడేస్ దొరకాయని తెగ ఆనందపడుతున్నాడు విజయ్ దేవరకొండ.