Salman Khan : సల్మాన్ ఖాన్‌కి బెదిరింపు ఇమెయిల్.. 5 ఏళ్లగా మర్డర్ ప్లాన్.. అసలు కథ ఏంటి?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకని చంపిన కేసులో దోషిగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు గురించి ఒక గ్యాంగ్ స్టార్, సల్మాన్ ని చంపాలని చూస్తున్నాడు. అసలు ఒక గ్యాంగ్ స్టార్ కి, సల్మాన్ కి, కృష్ణ జింకకి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా?

Salman Khan : సల్మాన్ ఖాన్‌కి బెదిరింపు ఇమెయిల్.. 5 ఏళ్లగా మర్డర్ ప్లాన్.. అసలు కథ ఏంటి?

Salman Khan is once again threatened by Lawrence Bishnoi

Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) దేశవ్యాప్తంగా ఎంతటి పాపులారిటీని సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే కృష్ణ జింకని చంపిన కేసులో నిందితుడిగా నిలిచి తీవ్ర వ్యతిరేకతను కూడా ఎదురుకున్నాడు. 1998 లో ‘హమ్ సాత్ సాత్ హై’ షూటింగ్ సమయంలో రాజస్థాన్ జోధ్‌పూర్ అడవుల్లో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ దోషిగా నిలిచి, జైలుకి వెళ్లి బెయిల్ పై బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విషయం గురించి గత 5 ఏళ్లగా సల్మాన్ పై మర్డర్ ప్లాన్ జరుగుతూ వస్తుంది. ఇప్పటికే రెండు సార్లు హత్యా ప్రయత్నం కూడా జరిగింది.

Salman Khan: సల్మాన్ ఖాన్‌ను చంపడమే జీవిత లక్ష్యం.. సల్మాన్‌కు రావణుడి కంటే అహం ఎక్కువ: లారెన్స్ బిష్ణోయ్

పంజాబీ సింగర్ ‘సిద్దూ మూస్ వాలా’ (Sidhu Moose Wala) హత్య కేసులో జైలుకి వెళ్లిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) ఈ హత్యకి ప్లాన్ చేశాడు. అసలు ఒక గ్యాంగ్ స్టార్ కి, సల్మాన్ కి, కృష్ణ జింకకి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? లారెన్స్ బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణ జింకలను పవిత్రంగా భావిస్తారు. అటువంటి జింకను సల్మాన్ వేటాడి చంపడంతో, లారెన్స్ అండ్ గ్యాంగ్ సల్మాన్ ని చంపాలనే నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి సల్మాన్ పై పలుమార్లు ఎటాక్ కోసం భారీ ప్లాన్ ని కూడా వేశారు. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు ఇమెయిల్ పంపించారు.

Salman Khan : మరోసారి సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. రెక్కీ చేసిన రౌడీషీటర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..

లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు రోహిత్ గార్గ్ అనే వ్యక్తి నుంచి శనివారం మధ్యాహ్నం సల్మాన్ కి ఒక ఇమెయిల్ వచ్చింది. ఆ ఇమెయిల్ లో.. ”లారెన్స్ ఇటీవల ఒక న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూను సల్మాన్ తప్పక చూసి ఉంటాడు. ఒకవేళ చూడకపోతే, దానిని చూడాలి” అని ఇమెయిల్ లో పేర్కొంది. ఆ ఇంటర్వ్యూలో లారెన్స్ మాట్లాడుతూ.. ‘సల్మాన్ ఈ విషయాన్ని ముగించాలనుకుంటే, నా అనుచరుడు గోల్డీతో ముఖాముఖి మాట్లాడాలని’ చెబుతూ సల్మాన్ కి వార్నింగ్ ఇచ్చాడు.

ఇక బెదిరింపు ఇమెయిల్ రావడంతో సల్మాన్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు లారెన్స్ మరియు అతని అనుచరులు గోల్డీ, రోహిత్ పై కేసు నమోదు చేశారు. 120-B (పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ కాన్స్పిరసీ), 506-II (పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ ఇంటిమిడేషన్), 34 (కామన్ ఇంటెన్షన్) వంటి సెక్షన్లు కింద ఎఫ్‌ఐఆర్ (FIR) ఫైల్ చేశారు. అంతేకాదు సల్మాన్‌కు పోలీసులు Y+ కేటగిరీ భద్రతను, అలాగే ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్స్ మరియు 8-10 మంది కానిస్టేబుల్స్ లను సల్మాన్ యొక్క భద్రతా వివరాలలో 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇక ఈ బెదిరింపుతో సల్మాన్ అభిమానులపై ఆంక్షలు విధించారు. సబర్బన్ బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని సల్మాన్ నివాసం మరియు కార్యాలయానికి అభిమానులు రాకూడదని ఆంక్షలు పెట్టారు.