Samantha : సమంత బర్త్ డే వేడుకల్లో రచ్చ రచ్చ.. లేట్ గా పోస్ట్ చేసినా మాములుగా లేవుగా..

ఏప్రిల్ 28 సమంత పుట్టిన రోజు. అయితే పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకున్నట్టు సమాచారం వచ్చినా ఫోటోలు, వీడియోలు ఏమి బయటపెట్టలేదు సమంత. తాజాగా సమంత తన సోషల్ మీడియాలో ఏప్రిల్ కి సంబంధించి కొన్ని ఫోటోలు పోస్ట్ చేయగా.. ఇందులో సమంత పుట్టిన రోజు ఫొటోలు, వీడియోలు కూడా ఉన్నాయి.

Samantha : సమంత బర్త్ డే వేడుకల్లో రచ్చ రచ్చ.. లేట్ గా పోస్ట్ చేసినా మాములుగా లేవుగా..

Samantha birthday celebrations goes viral

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఇటీవలే శాకుంతలం(Shakunthalam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని పాన్ ఇండియా(Pan India)రిలీజ్ చేసినా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం సమంత బాలీవుడ్(Bollywood) లో సిటాడెల్(Citadel) సిరీస్, తెలుగులో ఖుషి(Kushi) సినిమా చేస్తుంది. ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక శాకుంతలం ప్రమోషన్స్ కి సమంత ఇండియా అంతా తిరిగింది.

ఇటీవల సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతీది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తన గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా ఇండైరెక్ట్ గా కౌంటర్లు కూడా ఇస్తుంది. ఇటీవలే సమంత పుట్టిన రోజు జరిగింది. ఏప్రిల్ 28 సమంత పుట్టిన రోజు. అయితే పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకున్నట్టు సమాచారం వచ్చినా ఫోటోలు, వీడియోలు ఏమి బయటపెట్టలేదు సమంత.

Samantha : పర్సనల్ ఫీలింగ్స్ ని యాడ్స్ లో పెట్టిందా?? ఆ విషయంలో సమంతనే ఫస్ట్..

తాజాగా సమంత తన సోషల్ మీడియాలో ఏప్రిల్ కి సంబంధించి కొన్ని ఫోటోలు పోస్ట్ చేయగా.. ఇందులో సమంత పుట్టిన రోజు ఫొటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ సిరీస్ ల డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే, వాళ్ళ టీంతో కలిసి సమంత తన పుట్టిన రోజు వేడుకలను అర్ధరాత్రి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. రాజ్ అండ్ డీకే సమంతకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. సమంత కేక్ కట్ చేసి అరుస్తూ, ఎంజాయ్ చేస్తూ తన బర్త్ డే వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంది. దీంతో సమంత బర్త్ డే వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి చూసి వామ్మో సమంత మాములుగా రచ్చ చేయట్లేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)