Jawan Movie: రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన జవాన్.. షారుఖ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్..?

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ మూవీని సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.

Jawan Movie: రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన జవాన్.. షారుఖ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్..?

Shah Rukh Khan Jawan Movie Locks Release Date

Jawan Movie: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇటీవల ‘పఠాన్’ మూవీతో గ్రాండ్ విక్టరీని అందుకున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీని శరవేగంగా రెడీ చేస్తున్నాడు షారుక్. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేస్తున్న ‘జవాన్’ మూవీలో షారుఖ్ నటిస్తున్నాడు.

Jawan Movie: షారుక్ ‘జవాన్’ టీజర్ వచ్చేది అప్పుడేనా..?

ఈ సినిమాను గతంలోనే అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ప్రస్తుతం వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తోంది. ఈ మూవీలో షారుఖ్ మరోసారి తనదైన యాక్షన్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను తొలుత జూన్ 2న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. కానీ, తాజాగా జవాన్ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ వాయిదా వేస్తూ అనౌన్స్ చేశారు.

SRK Jawan: షారుక్ ‘జవాన్’లో అల్లు అర్జున్ ప్లేస్‌లో ఆ హీరో..?

జవాన్ మూవీని సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈమేరకు ఓ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో అందాల భామ నయనతార హీరోయిన్‌గా నటిస్తోండగా, దీపికా పదుకొనే ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో నటిస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Atlee (@atlee47)