Shankar Changes Plan For Indian 2: ఇండియన్ 2 కోసం ప్లాన్ మార్చిన శంకర్..?

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో పాటు శంకర్ ఎప్పటి నుంచో పూర్తి చేయాలని చూస్తున్న ‘ఇండియన్-2’ మూవీ కోసం కూడా ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. చరణ్‌తో చేస్తున్న సినిమా షూట్ చివరదిశకు చేరుకోవడంతో, ఈ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చి, ఇండియన్ 2 చిత్ర షూటింగ్‌ను సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేయాలని శంకర్ భావించాడు.

Shankar Changes Plan For Indian 2: ఇండియన్ 2 కోసం ప్లాన్ మార్చిన శంకర్..?

Shankar Changes Plan For Indian 2

Shankar Changes Plan For Indian 2: తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చరణ్ కెరీరో 15వ చిత్రంగా వస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాను శంకర్ తనదైన మార్క్ సోషల్ మెసేజ్‌తో తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో చరణ్ ఓ సరికొత్త పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే తెలిపాయి. అయితే ఈ సినిమాతో పాటు శంకర్ ఎప్పటి నుంచో పూర్తి చేయాలని చూస్తున్న ‘ఇండియన్-2’ మూవీ కోసం కూడా ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు.

Shankar: ఒక ఫైట్, ఒక పాట.. 20 కోట్లు హాంఫట్!

స్టార్ హీరో కమల్ హాసన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఇండియన్-2 మూవీ ఇప్పటికే పలుమార్లు షూటింగ్ వాయిదా వేసుకుంది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారా అని తమిళ ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. అయితే చరణ్‌తో చేస్తున్న సినిమా షూట్ చివరదిశకు చేరుకోవడంతో, ఈ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చి, ఇండియన్ 2 చిత్ర షూటింగ్‌ను సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేయాలని శంకర్ భావించాడు. కానీ.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్‌లు ఆగిపోవడంతో, శంకర్ తన ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.

Shankar: ఇండియన్-2.. స్పీడ్ పెంచేస్తానంటోన్న శంకర్!

ముందుగా అనుకున్నట్లుగా సెప్టెంబర్ నెలలో కాకుండా, ఆగస్టు 24 నుంచే ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ను తిరిగి స్టార్ట్ చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ షూటింగ్‌లోని చిన్న షెడ్యూల్‌లో ముఖ్యమైన నటీనటులు లేకుండానే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయనున్నాడట. ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.