Shankar: ఒక ఫైట్, ఒక పాట.. 20 కోట్లు హాంఫట్!

సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించే సినిమాలకు నార్త్‌లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయన తీసే సినిమాలను దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తుంటారు....

Shankar: ఒక ఫైట్, ఒక పాట.. 20 కోట్లు హాంఫట్!

20 Croroes For One Song And One Fight In Ram Charan Shankar Movie

Shankar: సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించే సినిమాలకు నార్త్‌లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయన తీసే సినిమాలను దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తుంటారు. అయితే తాజాగా శంకర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతమేర షూటింగ్ కూడా జరుపుకుంది. ఇక ఈ సినిమాను RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

RC15: చెర్రీ మొదలు పెట్టేస్తున్నాడు.. అమృత్ సర్ లో శంకర్ సినిమా రీస్టార్ట్

కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. RC15 సినిమాను శంకర్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడని, అందుకే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌తో తీర్చిదిద్దుతున్నాడట. అయితే శంకర్ సినిమా అంటేనే భారీ బడ్జెట్ అని ఆడియెన్స్ ఫిక్స్ అవుతారు. కానీ ఈ సినిమా కోసం ఆయన కాస్త ఎక్కువగానే నిర్మాతతో ఖర్చు పెట్టిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్, ఓ పాట కోసం ఏకంగా రూ.20 కోట్ల ఖర్చు పెట్టించాడట ఈ డైరెక్టర్.

RC15 : స్టార్ హీరోల్ని విలన్స్ గా మార్చిన రామ్ చరణ్.. భారీగా ప్లాన్ చేసిన శంకర్

కేవలం ఒక్క పాట, ఒక్క ఫైట్‌‌కే ఇంత భారీగా ఖర్చు పెట్టించాడంటే.. ఇక సినిమా పూర్తయ్యే సరికి శంకర్ నిర్మాతతో ఎంతమేర ఖర్చు పెట్టిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఓ మంచి కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాలో చరణ్ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తాడని, ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ మరోసారి పాన్ ఇండియా ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.