Sidharth-Kiara : జైసల్మీర్ కి క్యూ కడుతున్న బాలీవుడ్.. సైలెంట్ గా సిద్దార్థ్ – కియారా పెళ్లి..

ఫిబ్రవరి 6న సిద్దార్థ్-కియారా వివాహం రాజస్థాన్ జైసల్మీర్ లో జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు జైసల్మీర్ కి చేరుకున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరుగా జైసల్మీర్ కి క్యూ కట్టారు........

Sidharth-Kiara : జైసల్మీర్ కి క్యూ కడుతున్న బాలీవుడ్.. సైలెంట్ గా సిద్దార్థ్ – కియారా పెళ్లి..

sidharth malhotra and kiara advani wedding on jaisalmer on february 5th

Sidharth-Kiara :  ఇటీవల సినీ స్టార్లు వరుసగా పెళ్లిబాజాలు మోగిస్తున్నారు. బాలీవుడ్ లోఅయితే వరుసగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు పలువురు ప్రముఖులు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ ఒక్కటి కాబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చినా వీటిపై స్పందించలేదు. ఇక వీరి పెళ్లి జరుగుతుందని చెప్పినా దీనిపై కూడా స్పందించట్లేదు.

కానీ సైలెంట్ గా సిద్దార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ పెళ్లి చేసేసుకుంటున్నారు. షేర్షా సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పట్నుంచి వీరి ప్రేమ కొనసాగుతూ వచ్చింది. ఇన్నాళ్లు బాలీవుడ్ పార్టీలకి, ఫంక్షన్స్ కి కలిసి జంటగా వచ్చారు. ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరిగేశారు. కానీ పెళ్లి గురించి మాత్రం చెప్పట్లేదు. వీరు చెప్పకపోయినా బాలీవుడ్ మీడియా వీరి పెళ్లి అప్డేట్స్ వరుసగా ఇచ్చేస్తుంది.

ఫిబ్రవరి 6న సిద్దార్థ్-కియారా వివాహం రాజస్థాన్ జైసల్మీర్ లో జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు జైసల్మీర్ కి చేరుకున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరుగా జైసల్మీర్ కి క్యూ కట్టారు. షాహిద్ కపూర్, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, రోహిత్ శెట్టి.. ఇలా పలువురు స్టార్ సెలబ్రిటీలు ఇప్పటికే జైసల్మీర్ కి వెళ్లారు. మరి కొంతమంది సెలబ్రిటీలు ఇవాళ్టి రాత్రి వరకు లేదా రేపు ఉదయానికి జైసల్మీర్ చేరుకుంటారని సమాచారం.

Allu Aravind : బన్నీ భార్య పై అల్లు అరవింద్ కామెంట్స్.. కోడలు గురించి ఏమి మాట్లాడాడో తెలుసా?

కత్రినా-విక్కీ పెళ్ళిలో లాగే ఫోన్స్ లోపలికి ఎంట్రీ లేదని సమాచారం. దీంతో పెళ్లి మండపం లోపలి నుంచి ఒక్క ఫోటో కూడా బయటకి వచ్చే ఛాన్స్ లేదు. వాళ్ళే అధికారికంగా పోస్ట్ చేయాలి. ఇలా బాలీవుడ్ అంతా సిద్దార్థ్-కియారా పెళ్లితో హడావిడిగా ఉన్నా వాళ్ళు మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం. డైరెక్ట్ గా పెళ్లి ఫొటోలతోనే చెప్తారేమో. ఇక అభిమానులు, నెటిజన్లు కూడా ముందుగానే ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.