సురేష్ రైనాకు సోనూసూద్ సాయం.. పది నిమిషాల్లోనే!

సురేష్ రైనాకు సోనూసూద్ సాయం.. పది నిమిషాల్లోనే!

Sonu Sood Comes To Suresh Rainas Aid After Cricketer Requests Oxygen Cylinder For Relative

‘Reaching in 10 minutes’: కరోనా కష్టకాలంలో మెస్సయ్యగా మారిన నటుడు సోనూసూద్.. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఆక్సిజన్, బెడ్, ప్లాస్మా.. సాయం ఏదైనా నేనున్నాను అంటూ వచ్చేస్తున్నాడు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా క్రికెటర్ సురేష్ రైనాకు కూడా సాయం అనగానే నిమిషాల్లో సాయం చేశాడు సోనూసూద్.

కరోనా బాధితులు దేశంలో ఎక్కడ ఉన్నా వారికి అవసరమైన ఆర్థిక, వైద్య సాయం అందిస్తూ అండగా నిలుస్తున్న సోనూసూద్.. మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనాకు సాయం చేయగా.. ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. కేవలం 10 నిమిషాల్లోనే మెడికల్‌ ఆక్సిజన్​ సిలిండర్​ను పంపి మానవత్వాన్ని చాటుకున్నారు సోనూసూద్.

‘మీరట్‌లో మా ఆంటీ కోసం అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ కావాలి. ఆమె వయసు 65ఏళ్లు. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో హాస్పిటల్‌లో ఉంది’ అంటూ సురేశ్‌ రైనా ట్వీట్‌ చేయగానే.. రైనా ట్వీట్​కు వెంటనే స్పందించారు సోనూ సూద్‌. 10నిమిషాల్లోనే ఆక్సిజన్‌ సిలిండర్‌ అక్కడికి చేరుకుంటుంది భాయ్‌ అంటూ రిప్లై ఇచ్చాడు సోనూసూద్.