Bigg Boss 5: శ్రీరామ్‌కు సోనూ సపోర్ట్.. టైటిల్ కొట్టడం ఖాయమా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో ఐదో సీజన్ అప్పుడే పదో వారానికి చేరుకుంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ సీజన్ లో హౌస్ లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా..

Bigg Boss 5: శ్రీరామ్‌కు సోనూ సపోర్ట్.. టైటిల్ కొట్టడం ఖాయమా?

Bigg Boss 5

Bigg Boss 5: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో ఐదో సీజన్ అప్పుడే పదో వారానికి చేరుకుంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ సీజన్ లో హౌస్ లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా.. ఇప్పటికే పదిమంది కంటెస్టెంట్లు బయటకొచ్చేశారు. ప్రస్తుతం హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. తొమ్మిది మంది ఎలిమినేటి అయితే.. తాజాగా ఆరోగ్యం బాగోలేక జెస్సీని బిగ్ బాస్ ఇంటి నుండి బయటకి తీసుకొచ్చాడు. దీంతో ఇప్పుడు హౌస్ లో ఇక తొమ్మిది మంది మాత్రమే ఉండగా జెస్సీ సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు.

Bigg Boss 5: చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం?!

కాగా.. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న సభ్యులకు బయట నుండి పలువురు సెలబ్రెటీల నుంచి సపోర్ట్ కూడా బాగానే లభిస్తుంది. ఇందులో సింగర్ శ్రీరామ్ ముందున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ నుండి కూడా పలువురు ఈ తెలుగు సింగర్ కోసం సపోర్ట్ చేస్తూ వీడియోలు, పోస్టులు చేస్తుండగా తాజాగా కరోనా కష్టకాలం నుండి ఎందరినో ఆదుకుంటూ రియల్ హీరో అనిపించుకుంటున్న నటుడు సోనూసూద్ కూడా శ్రీరామచంద్రకి మద్దతు ప్రకటించాడు.

Bigg Boss 5: వచ్చేవారం ఇంట్లో కొత్త కంటెస్టెంట్లు.. ఇప్పుడు వైల్డ్ ఎంట్రీ ఏంటి?!

తాజాగా.. తెలుగు బిగ్‌బాస్‌ షోపై స్పందించిన సోనూ.. సింగర్‌ శ్రీరామచంద్రకు తన మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5లో శ్రీరామ్‌ను చూస్తున్నారా?.. నేనూ చూస్తున్నాను. షోలో నీ బెస్ట్‌ ఇవ్వు శ్రీరామ్‌. అతడికివే నా ప్రేమాభినందనలు.. లవ్‌ యూ మ్యాన్‌’ అని సోనూసూద్ పేర్కొంన్నాడు. ఈ వీడియో చూసిన శ్రీరామ్‌ అభిమానులు ఈ సారి శ్రీరామ్ టైటిల్ కొట్టడం పక్కా.. ఈ సీజన్ విన్నర్‌గా శ్రీరామ్‌ నిలవడం గ్యారెంటీ అని కామెంట్లు పెడుతున్నారు.