Star Heroin’s Remuneration: హిట్ పడిందా.. చుక్కలు చూపిస్తున్న హీరోయిన్లు!

హీరోలే కాదు... సాలిడ్ హిట్ పడితే హీరోయిన్స్ కూడా తగ్గేదే లే అంటున్నారు. మరీ మన హీరోలంత డిమాండ్ చేయట్లేదు కానీ వాళ్లకున్న రేంజ్ చూపిస్తున్నారు. హిట్టు సినిమాకు ముందు, హిట్ సినిమా..

Star Heroin’s Remuneration: హిట్ పడిందా.. చుక్కలు చూపిస్తున్న హీరోయిన్లు!

Star Heroin's Remuneration

Star Heroin’s Remuneration: హీరోలే కాదు… సాలిడ్ హిట్ పడితే హీరోయిన్స్ కూడా తగ్గేదే లే అంటున్నారు. మరీ మన హీరోలంత డిమాండ్ చేయట్లేదు కానీ వాళ్లకున్న రేంజ్ చూపిస్తున్నారు. హిట్టు సినిమాకు ముందు, హిట్ సినిమా తర్వాత అన్నట్టు కొత్త లెక్కలు చెప్తున్నారు.

Star Hero’s Remuneration: అమాంతం రేట్ పెంచేస్తున్న స్టార్ హీరోలు?!

కృతిశెట్టి రెమ్యునరేషన్ విషయంలో రీసెంట్ గా ఓపెనయ్యాడు డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ. ఉప్పెన మాసివ్ హిట్ తో అడిగినంత ఇవ్వక తప్పలేదన్నాడు. నిజానికి ఉప్పెనతో ఇంట్రడ్యూస్ అయిన వెంటనే టపీటపీమని సినిమాలకు సైన్ చేసేసింది కృతిశెట్టి. ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడం.. కృతి ఆ సినిమాలో హైలైట్ కావడంతో పారితోషకం పెంచేసింది. అందుకే బంగార్రాజు మూవీకి దాదాపు 2 కోట్లు అందుకున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి. ఈమధ్యే ఆమె నటించిన శ్యామ్ సింగ రాయ్ కూడా హిట్ అనిపించుకుంది. బంగార్రాజు కూడా సంక్రాంతి విన్నర్ అయితే మరింత రేట్ పెంచే ఛాన్స్ ఉంది.

Aha OTT: తెలుగు మోస్ట్ వాంటెడ్ ఓటీటీ ఆహా.. త్వరలో తమిళంలో!

పాన్‌ ఇండియా సినిమా పుష్పతో నేషనల్ క్రష్ రష్మిక.. ఇప్పుడు క్రష్మికగా మారింది. 5 భాషల్లో మూవీ రిలీజ్‌ కావడంతో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకుంది. అంతేకాదు ప్రెజెంట్ బాలీవుడ్ లో కూడా ఫుల్ బిజీగా ఉంటోంది. దీంతో పారితోషికాన్నిపెంచేసిందన్న వార్త ఫిల్మ్‌ దునియాలో చక్కర్లు కొడుతోంది. నిన్నమొన్నటి వరకు 2 కోట్లు డిమాండ్ చేసిన రష్మిక తన రెమ్యునరేషన్‌ను ఇప్పుడు 3 కోట్ల వరకు పెంచేసింది. ఈ ఎక్స్‌ప్రెషన్‌ క్వీన్‌ తో పని చేయాలంటే ఇప్పుడు చాలా కాస్ట్లీ.

BBB: బాలయ్య-బోయపాటి-బన్నీ మల్టీస్టారర్.. రచ్చ రచ్చేనా?

ఆర్ఆర్ఆర్ మూవీ కోసం అలియా భట్ 9 కోట్లు తీసుకుందనే టాక్ ఉంది. మళ్లీ సినిమాలో ఆమె కనిపించేది కేవలం 20 నిమిషాలే. పాన్ ఇండియా లుక్ కోసం అలియాను తీసుకున్న రాజమౌళి.. భారీ మొత్తాన్ని ముట్టజెప్పారు. అటు లేడీ ఓరియెంటెడ్ మూవీ గంగూబాయ్ కతియావాడి కోసం అలియా 20 కోట్లు అందుకుందని ముంబై సమాచారం. తనే కీ రోల్ చేసే సినిమాల్లో ఒకలా.. హీరోతో కలిసి నటిస్తే మరోలా ఛార్జ్ చేస్తోంది అలియా. డిమాండ్ కి తగ్గట్టే అడుగుతున్నానని డైరెక్ట్ గానే చెప్పేస్తుందీ క్రేజీ గర్ల్.