Six Pack Hero's: బస్తీమే సవాల్.. చొక్కాలు చించుకుంటున్న హీరోలు! Tollywood star Heroes tearing their shirts with six pack body's

Six Pack Hero’s: బస్తీమే సవాల్.. చొక్కాలు చించుకుంటున్న హీరోలు!

ఒకప్పుడు పద్దతిగా.. డీసెంట్ గా ఉంటే హీరో అనేవాళ్లు.. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు చొక్కాలు చించుకుని కండలు చూపిస్తేనే హీరోయిజం..

Six Pack Hero’s: బస్తీమే సవాల్.. చొక్కాలు చించుకుంటున్న హీరోలు!

Six Pack Hero’s: ఒకప్పుడు పద్దతిగా.. డీసెంట్ గా ఉంటే హీరో అనేవాళ్లు.. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు చొక్కాలు చించుకుని కండలు చూపిస్తేనే హీరోయిజం ఎలివేట్ అవుతోంది. చాలామంది ఆడియన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. అందుకే.. హీరోలంతా ఒల్లొంచి కష్టపడుతున్నారు. కుదిరితే సిక్స్ ప్యాక్.. ఇంకా కుదిరితే ఎయిట్ ప్యాక్స్ చేసి థియేటర్స్ లో ఈల వేసి గోల చేసేట్టు చేస్తున్నారు.

Pushpa 2: ఫస్ట్ పార్ట్ ఇచ్చిన సక్సెస్.. పుష్ప-2పై భారీ అంచనాలు!

టాలివుడ్ యంగ్ హీరోలంతా.. ఇప్పుడు చొక్కాలు చించుకొని మరీ హీరోయిజం చూపిస్తున్నారు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ లతో.. బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో కంప్లీట్ గెటప్ చేంజ్ చేశిన హీరో రామ్.. మరోసారి ది వారియర్ మూవీ కోసం భారీగా వర్కవుట్స్ చేస్తున్నాడు. లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ బైలింగ్వల్ మూవీలో.. రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అందుకే.. ఓ రేంజ్ లో కండలు పెంచుతున్నాడట. ది వారియర్ క్లైమాక్స్ ఫైట్ లో రామ్ సిక్స్ ప్యాక్ ని ఓ రేంజ్ లో చూపించే ప్లాన్ చేస్తున్నారట.

Naga Shaurya: ఒక్క హిట్ ప్లీజ్.. బ్రేక్ కోసం నాగశౌర్య ఫీట్స్

మార్చి 18న రిలీజ్ కి రెడీ అవుతోన్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ.. గనీలో వరుణ్ తేజ్ ఫస్ట్ టైం చొక్కా విప్పాడు. ఇప్పటికే రిలీజ్ ఐన గని టీజర్స్ ని బట్టి చూస్తే.. సిక్స్ ప్యాక్ తో బాక్సర్ గని పంచుల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరుణ్ సిక్స్ ప్యాక్ లుక్ కి మరీ ముఖ్యంగా యూత్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Prabhas: ప్రభాస్ జాతర.. డేట్స్ కోసం వెంటపడుతున్న ప్రొడ్యూసర్స్!

ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తోన్న అఖిల్ అక్కినేని కూడా.. బీభత్సమైన వర్కవుట్స్ తో చెమటలు కక్కిస్తున్నాడు. మొన్నటిదాకా లవర్ బాయ్ లా కనిపించిన అఖిల్.. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఏజెంట్ మూవీ కోసం.. సిక్స్ ప్యాక్ చేసి కంప్లీట్ గా మారిపోయాడు. అఖిల్ సిక్స్ ప్యాక్ ఫోటోస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అఖిల్ బాడీ మేకోవర్ చూస్తుంటె ఏజెంట్ మూవీలో యాక్షన్ సీన్స్ భారీ లెవల్లో ప్లాన్ చేశినట్టు తెలుస్తోంది.

RRR: చరణ్-తారక్ లలో రాజమౌళికి ఇష్టమైన పాత్ర ఇదే!

ఇక లైగర్ మూవీ కోసం రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. జిమ్ములో బాగానే పొగలు కక్కించాడు. లైగర్ టీజర్ లో విజయ్ అగ్రెసివ్ యాటిట్యూడ్ కి.. ఐరన్ బాడీ తోడవ్వడంతో బాక్సింగ్ రింగ్ లో పంచ్ లు ఓ రేంజ్ లో పడ్డట్టు కనిపిస్తోంది. అంతేకాదు.. లైగర్ లో బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కూడా ఓ క్యారెక్టర్ చేయడంతో సినిమా భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

Telugu Small Movies: రిలీజ్ కష్టాలు.. చిన్న సినిమాలకు పెద్ద చిక్కులు!

ఆర్ఎక్స్ హండ్రెడ్ తో టాప్ గేర్ వేసి దూసుకుపోతున్న హీరో కార్తికేయ.. మొదటి సినిమాతోనే సిక్స్ ప్యాక్ హీరో అనిపించుకున్నాడు. ఆ ఫిట్ నెస్సే కార్తికేయకు విలన్ గా కూడా అవకాశాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తమిళ్ లో తల అజిత్ మూవీ వాలిమైలో విలన్ గా చేస్తోన్న కార్తికేయ.. మరోసారి తన సిక్స్ ప్యాక్ బాడీతో దుమ్మురేపనున్నాడు. యాక్షన్ సీన్స్ లో అజిత్ తో పోటీపడి స్టంట్స్ చేశాడు కార్తికేయ.

Telugu Dubbing Films: బాలీవుడ్ స్క్రీన్స్‌పై తెలుగు డబ్బింగ్ సినిమాల దాడి!

యంగ్ హీరోలే కాదు.. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇప్పటికే సిక్స్ ప్యాక్ బాడీతో మెస్మరైజ్ చేశారు. ఇప్పటికీ అదే ఫిట్ నెస్ ని మెయిన్ టైన్ చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో రకరకాల ట్రెండ్స్ వచ్చాయి పోయాయి కని.. సిక్స్ ప్యాక్ ట్రెండ్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే సీనియర్ హీరోలు కూడా సిక్స్ ప్యాక్ చేసేందుకు వెనకడుగు వేయడం లేదు.

×