Varun – Lavanya : వరుణ్ – లావణ్య నిశ్చితార్థం.. ఎక్కడో తెలుసా? వాళ్ళు మాత్రమే హాజరవుతున్నారట..
నేడు జూన్ 9న వీరి నిశ్చితార్థం అంటూ సినీ పరిశ్రమలోని పలువురు మీడియా ప్రతినిధులు ప్రకటించారు. నిశ్చితార్థం(Engagement) ఇన్విటేషన్ కార్డు అంటూ ఓ ఇన్విటేషన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Varun Tej and Lavanya Tripathi Engagement happening today in Hyderabad
Varun Tej – Lavanya Tripathi : హీరో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారని, డేటింగ్ లో ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి. వీటిపై ఇప్పటికి కూడా వీరిద్దరూ స్పందించలేదు. కానీ నేడు జూన్ 9న వీరి నిశ్చితార్థం అంటూ సినీ పరిశ్రమలోని పలువురు మీడియా ప్రతినిధులు ప్రకటించారు. నిశ్చితార్థం(Engagement) ఇన్విటేషన్ కార్డు అంటూ ఓ ఇన్విటేషన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత కొన్నాళ్లుగా వినిపించిన లావణ్య – వరుణ్ వార్తలు నిజమే అని వీటితో క్లారిటీకి వచ్చేసారు జనాలు.
నేడు జూన్ 9న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ నిశ్చితార్థం చాలా సింపుల్ గా చేస్తున్నారు. కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే ఈ నిశ్చితార్థం జరగనున్నట్టు సమాచారం. వరుణ్ – లావణ్య నిశ్చితార్థానికి చిరంజీవి, చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్.. ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ హీరోలంతా రాబోతున్నారు. నేడు సాయంత్రానికి వీరి నిశ్చితార్థం ఫొటోలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవదారి అర్జున సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. లావణ్య ఓ తమిళ్ సినిమాలో నటిస్తుంది. మరి ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి. ఇక వీరి నిశ్చితార్థం సందర్భంగా పలువురు అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Hearty congratulations to
𝑴𝒆𝒈𝒂 𝑷𝒓𝒊𝒏𝒄𝒆 @IAmVarunTej & @Itslavanya on getting Engaged on 9th June, 2023 🤩🥳Wishing a lifetime of happiness together✨#VarunTejKonidela #VarunTej #LavanyaTripathi pic.twitter.com/bfL9tDC0aV
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 8, 2023