Vignesh Shivan : నయన్ – విగ్నేశ్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ.. కవలపిల్లల స్పెషల్ ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసిన విగ్నేశ్..
నయన్ - విగ్నేశ్ 2022 జూన్ 9న వివాహం చేసుకున్నారు. నేటికి వారి వివాహమయి సంవత్సరం అవుతుండటంతో అభిమానులు, నెటిజన్లు వారికి సోషల్ మీడియా వేదికగా మొదటి వివాహ వార్షికోత్సవ(First Wedding Anniversary) శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Vignesh Shivan shares special photos and post regarding first wdding anniversary with Nayanthara
Nayanthara : సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్(Vignesh Shivan) కొన్నాళ్ళు ప్రేమించుకొని అనంతరం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సరోగసి(Surrogacy) ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. నయన్ – విగ్నేశ్ 2022 జూన్ 9న వివాహం చేసుకున్నారు. నేటికి వారి వివాహమయి సంవత్సరం అవుతుండటంతో అభిమానులు, నెటిజన్లు వారికి సోషల్ మీడియా వేదికగా మొదటి వివాహ వార్షికోత్సవ(First Wedding Anniversary) శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
డైరెక్టర్ విగ్నేశ్ రెగ్యులర్ గా నయన్ తో ఉన్న ఫొటోలు, వారి ఫ్యామిలీ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూనే ఉంటాడు. తాజాగా నేడు నయన్ – విగ్నేశ్ వివాహ వార్షికోత్సవం రోజున వారిద్దరి ఫొటోలు షేర్ చేసి విగ్నేశ్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశారు. నయన్ – విగ్నేశ్ విదేశాల్లో ప్రేమగా దిగిన కొన్ని ఫోటోలని షేర్ చేస్తూ.. నిన్నే నాకు వివాహం అయినట్టు ఉంది. సడెన్ గా అందరూ నాకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లవ్ యు తంగమై. మన జర్నీని ప్రేమ, ఆశీర్వాదాలతో మొదలుపెట్టాం. మనం ఇంకా చాలా దూరం వెళ్లి కలిసి సాధించాల్సినవి చాలా ఉన్నాయి. మా జీవితంలో ఉన్న అందరి మంచి వ్యక్తులు, దేవుని ఆశీర్వాదాలతో మేము రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం అని పోస్ట్ చేశాడు విగ్నేశ్ శివన్.
Varun – Lavanya : వరుణ్ – లావణ్య నిశ్చితార్థం.. ఎక్కడో తెలుసా? వాళ్ళు మాత్రమే హాజరవుతున్నారట..
అలాగే నయనతారతో పాటు తన కవలపిల్లలు ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ.. అప్పుడే సంవత్సరం అయింది. సంవత్సరంలో చాలా స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి, కష్ట సుఖాలు ఉన్నాయి. కానీ ఇంటికి వస్తే ప్రేమగా చూసే ఫ్యామిలీ ఉంది. నాకు ఎంతో స్పెషల్ అయిన ఉయర్, ఉలగంలు మా జీవితాన్ని మరింత అందంగా మార్చారు. వారు నాకు ఎనర్జీ ఇస్తూ నా డ్రీమ్స్ వైపు మరింత పరిగెత్తేలా చేస్తున్నారు అంటూ మరో ఎమోషనల్ పోస్ట్ చేశాడు విగ్నేశ్. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.