Bigg Boss 5 Telugu: బీబీహౌస్‌లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ.. ఎవరీ ప్రీతీ అన్షు?

అనుకున్నట్టుగానే ఆరవ వారం కూడా ఎలిమినేషన్ లో ప్రేక్షకులు ఊహించిన విధంగానే కంటెస్టెంట్ ను బయటకి పంపించేశారు. శ్వేతా వర్మను ఆరవ వారం ఇంటి నుండి బయటకొచ్చేసింది. బిగ్ బాస్ ఐదవ సీజన్..

Bigg Boss 5 Telugu: బీబీహౌస్‌లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ.. ఎవరీ ప్రీతీ అన్షు?

Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu: అనుకున్నట్టుగానే ఆరవ వారం కూడా ఎలిమినేషన్ లో ప్రేక్షకులు ఊహించిన విధంగానే కంటెస్టెంట్ ను బయటకి పంపించేశారు. శ్వేతా వర్మను ఆరవ వారం ఇంటి నుండి బయటకొచ్చేసింది. బిగ్ బాస్ ఐదవ సీజన్ ఏడవ వారంలో అడుగుపెట్టింది. శ్వేతా బయటకి రావడంతో ఇక మిగిలింది 13 మందే. వాళ్లలో కూడా లేడీ కంటెస్టెంట్స్ బాగా తగ్గిపోయారు. ఇక గ్లామర్ అనేది ఇంట్లో ఆశించడం కూడా కష్టమే అయిపొయింది. అందుకే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సమయం ఆసన్నమైనట్లుగా తెలుస్తుంది.

Big Boss 5: అర్ధరాత్రి మానస్ దుప్పట్లో పింకీ.. బీబీ హౌస్‌లో మూడుముక్కలాట!

బిగ్‌బాస్ షోలో గ‌త సీజ‌న్ల‌లో దీక్షాసేత్‌, పూజా, కుమార్ సాయి, ముక్కు అవినాష్‌, స్వాతి దీక్షిత్‌ ఇలా కొంత‌మంది వైల్డ్‌కార్డ్ ద్వారా ఇంట్లోకి పంపించారు షో నిర్వాహకులు. అయితే ఈసారి లాంచింగ్ ఎపిసోడ్‌లోనే అత్య‌ధికంగా 19 మంది కంటెస్టెంట్ల‌ను హౌస్‌లోకి పంపించడంతో ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదేమోనని మెజారిటీ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ.. ఇదే సమయంలో గ్లామర్ కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ తప్పేలా లేదని కూడా బలమైన ప్రచారం జరిగింది. ఆ మ‌ధ్య యాంక‌ర్ వ‌ర్షిణి, విష్ణుప్రియ హౌస్‌లోకి అడుగుపెడుతున్నారంటూ పుకార్లు వ్యాపించాయి.

Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!

కానీ అపుడు అది నిజం కాలేదు. దాదాపుగా వర్షిణి, విష్ణుప్రియ బీబీ హౌస్ లోకి ఈ సీజన్ లో కనిపించడం కష్టమే. అయితే తాజాగా మ‌రో భామ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌బోతుందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రీతి అన్షు బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌బోతుందంటూ సోష‌ల్ మీడియ‌లో ప్ర‌చారం ఊపందుకుంది. ఇంతకీ ఈ ప్రీతీ అన్షు ఎవరా అని నెట్టింట చర్చ మొదలైంది. కాగా, ప్రీతి అన్షు ఒక మోడ‌ల్‌. మై దిల్ అనే షార్ట్ ఫిలింలోనూ న‌టించగా.. న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాల‌ని ఆశ‌ప‌డుతూ పరితపిస్తుంది.

Big Boss 5: శ్రీరామచంద్ర.. హమీదా అర్ధరాత్రి ముద్దులు.. షో శృతి మించుతోందా?

అయితే, ఆమెకి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే స్థాయి గుర్తింపు లేదని తెలుస్తుంది. మరి ఈ చిన్నదానికి బిగ్‌బాస్ ఆఫ‌ర్ ఎలా వచ్చిందో తెలియదు కానీ.. ఇప్పుడు అన్షు పేరు మాత్రం మారుమ్రోగుతుంది. అయితే.. ఇది దాదాపుగా నిజం కాదని.. కేవలం ఇదొక ప్రచారం మాత్రమేనని.. ఫేక్ ప్రచారం మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. అయితే.. ఇంట్లో ఎంటర్టైన్మెంట్ తగ్గుతుందనేది నిజమే కావడంతో ఈ షోలో ఏదోఒక మార్పులు అయితే జరగాల్సి ఉంది.