WPL 2023 Opening Ceremony : ఉమెన్స్ ఐపీఎల్ ఓపెనింగ్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వనున్న బాలీవుడ్ భామలు..

ఉమెన్స్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఆరంభం అదిరేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి రెండుగంటల ముందు నుంచే పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు..................

WPL 2023 Opening Ceremony : ఉమెన్స్ ఐపీఎల్ ఓపెనింగ్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వనున్న బాలీవుడ్ భామలు..

WPL 2023 Opening Ceremony conducting grandly with bollywood actresses kiara advani and kriti sanon special performances

WPL 2023 Opening Ceremony :  మనదేశంలో క్రికెట్ పై ఉన్న అభిమానం, క్రికెట్ కి ఉన్న అభిమానుల గురించి అందరికి తెలిసిందే. IPL చాలా బాగా సక్సెస్ అయి, క్రికెట్ అభిమానుల నుంచి విశేషదారణ పొంది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. IPL తరహాలోనే ఈ సంవత్సరం మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) తొలి సీజన్ నేడు అట్టహాసంగా ప్రారంభం కానుంది. 23 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. 87 మంది మహిళా క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. తొలి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ముంబయి జట్ల మధ్య ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.

అయితే ఉమెన్స్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఆరంభం అదిరేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి రెండుగంటల ముందు నుంచే పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఓపెనింగ్ లో బాలీవుడ్ నటీమణులు కియారా అద్వాణీ, కృతి సనన్ లు విచ్చేసి ప్రత్యేక ప్రదర్శన ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు సింగర్ AP ధిల్లాన్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నాడు. దీంతో ఈ ఓపెనింగ్ కార్యక్రమం కోసం కూడా క్రికెట్ అభిమానులు, సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 5.30 గంటల నుండి ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.

Nani : డాబాపై రంగులతో అతిపెద్ద నాని దసరా లుక్ గీసిన మహారాష్ట్ర ఫ్యాన్స్.. బొమ్మ అదిరిపోయిందిగా..

కియారా అద్వానీ ఇటీవలే సిద్దార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు WPL లో ప్రత్యేక ప్రదర్శన ఇస్తుండటంతో అందరి కళ్ళు కియారా పైనే ఉన్నాయి. మరి ఈ భామలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి. వీరితో పాటు పలువురు మహిళా క్రికెటర్స్ కూడా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని సాంసృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారని సమాచారం. రాబోయే నెల రోజులు WPL సందడి చేయనుంది.