Titanosaur Eggs: నర్మదా లోయలో తవ్వకాల్లో బయటపడ్డ 256 డైనోసార్ గుడ్లు ..

మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదీ పరీవాహక ప్రాంతంలో డైనోసార్ జాతికి చెందిన టైటానోసార్ గుడ్లను శాస్త్రవేత్తలు వెలికితీశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌కు చెందిన శిలాజ శాస్త్రవేత్తలు ధార్ జిల్లాలోని బాగ్, కుక్షి ప్రదేశాల్లో తవ్వకాలు జరిపిన సమయంలో ఈ పొడవాటి మెడతో ఉండే శాఖాహారులైన టైటానోసార్‌లకు చెందిన 256 గుడ్లు, పలు గూళ్లు వెలుగులోకి వచ్చాయి.

Titanosaur Eggs: నర్మదా లోయలో తవ్వకాల్లో బయటపడ్డ 256 డైనోసార్ గుడ్లు ..

Titanosaur Eggs

Titanosaur Eggs: కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించినట్లు చెప్పుకొనే టైటానోసార్లకు సంబంధించిన గుడ్లు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదీ పరీవాహక ప్రాంతంలో ఈ డైనోసార్ గుడ్లను శాస్త్రవేత్తలు వెలికితీశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌కు చెందిన శిలాజ శాస్త్రవేత్తలు ధార్ జిల్లాలోని బాగ్, కుక్షి ప్రదేశాల్లో తవ్వకాలు జరిపిన సమయంలో ఈ పొడవాటి మెడతో ఉండే శాఖాహారులైన టైటానోసార్‌లకు చెందిన 256 గుడ్లు, పలు గూళ్లు వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలు పీఎల్ఓఎస్ ఒన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Dinosaur : చిలీలో కొత్త డైనోసార్ జాతి గుర్తించిన పరిశోధకులు..

తవ్వకాల్లో బయటపడిన గుడ్లు 6.6 కోట్ల నుంచి 10 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్ జాతికి చెందిన టైటానోసార్ గుడ్లుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టైటానోసారిడ్ సౌరోపాడ్ కుటుంబానికి చెందిన డైనోసార్లు. భూమిపై నివసించిన అతిపెద్ద జంతు జాతుల్లో ఒకటి. టైటానోసార్‌లు ఒక విడతలో పెట్టిన గుడ్లను ఒక గుంతలో పాతిపెట్టడం వల్ల వాటి షెల్స్ఒకదానిలో ఒకటి ఇరుక్కునట్లు గుర్తించామని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విషయంపై ఢిల్లీ యూనివర్శిటీ జియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ.. డైనోసార్ లు తీవ్ర ఒత్తిడికి లోనయినట్లు పలు రకాల షెల్ గుడ్లు చూపిస్తున్నాయని తెలిపారు.

 

ఇక్కడ లభించిన గుడ్లన్నీ బహుళ పెంకులతో నిర్మితమై ఉడటాన్ని గమనించామని, పొదగడానికి అనువైన పరిస్థితులు లేనప్పుడు తల్లి తన గుడ్లను అండవాహికలోనే ఉంచుకోవడంతో పెంకుమీద పెంకు ఏర్పడి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక.. వాతావరణంలో మార్పులు, వరదలు, జంతువులను చెడుగా ప్రభావితం చేసే పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయనికూడా ఆయన తెలిపారు.