Encounter : పోలీసులకు వ్యతిరేకంగా గ్రామస్థుల నిరసన..కాల్పుల్లో ముగ్గురు మృతి

ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలోని​ బీజాపుర్​ జిల్లాలోని సిల్గేర్​ గ్రామంలో పోలీసులు, స్థానికుల మధ్య ఉద్రిక్తత తలెత్తింది.

Encounter : పోలీసులకు వ్యతిరేకంగా గ్రామస్థుల నిరసన..కాల్పుల్లో ముగ్గురు మృతి

Encounter

Chhattisgarh ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలోని​ బీజాపుర్​ జిల్లాలోని సిల్గేర్​ గ్రామంలో పోలీసులు, స్థానికుల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఈ ఘటన జరిగింది.

గత వారం సిల్గేర్​ గ్రామంలో పోలీసులు క్యాంప్​ ఏర్పాటు చేయగా.. దీనిని వ్యతిరేకించిన స్థానికులు రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఘర్షణ తీవ్రమైంది. కాల్పులకు దారితీసింది. పోలీస్ క్యాంప్ ​తో తమకు ప్రమాదమని తెలిసి.. నక్సలైట్లే గ్రామస్థుల సాయంతో నిరసనలకు దిగారని బస్తర్ ఐజీ తెలిపారు.

సోమవారం మధ్యాహ్నాం 12:30గంటల సమయంలో గ్రామస్ధుల ముసుగులో నక్సలైట్లు దాడికి తెగబడగా..తాము జరిపిన ఎదురుకాల్పుల్లో వారిలో ముగ్గురు చనిపోయారని పేర్కొన్నారు. అయితే, ఎన్ కౌంటర్ ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని..
చనిపోయిందా నక్సలైట్లా, గ్రామస్థులా అనేది ఇంకా స్పష్టత లేదని ఆయన తెలిపారు. కాగా,ప్రస్తుతం ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం…ఏప్రిల్-3,2021న సుక్మా జిల్లాలోని నక్సలైట్ ఎటాక్ లో 22మంది జవాన్లు చనిపోయిన ప్రాంతానికి 10కిలోమీటర్ల దూరంలోనే ఉంది.