తబ్లిగీ జమాత్ ఎపిసోడ్ దర్యాప్తు చేస్తున్న 5 ఢిల్లీ పోలీసులకు కరోనా పాజిటివ్

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2020 / 03:17 PM IST
తబ్లిగీ జమాత్ ఎపిసోడ్ దర్యాప్తు చేస్తున్న 5 ఢిల్లీ పోలీసులకు కరోనా పాజిటివ్

వివాదాస్పదమైన తబ్లిఘి జమాత్ ఎపిసోడ్ ను దర్యాప్తు చేస్తున్న ఐదుగురు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులకు కరోనా వైరస్ సోకినట్లు శనివారం(మే-2,2020)నిర్థారణ అయింది. ఐదుగురు అధికారులు తమ దర్యాప్తులో భాగంగా ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలోని తబ్లిగి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినట్లు సమాచారం. మార్చి మొదటి వారంలో నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో తబ్లిగీ జమాత్‌ సంస్థ నిర్వహించిన ప్రార్థనల తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసింది.

ఈ వ్యవహారంలో జమాతే చీఫ్‌ మౌలానా సాద్‌, ఇతర సభ్యుల నిర్లక్ష్యంగా వ్యవహించారన్న ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేపట్టింది. దీనికోసం నియమించిన టీమ్‌లో క్రైమ్‌ బ్రాంచ్‌ చెందిన ఐదుగరు పోలీసులకు కరోనా పాటివ్‌ వచ్చింది. మరికొందరు పోలీసులకు కూడా ఈ వైరస్‌ లక్షణాలు ఉన్నాయని, వారి స్వీయ నిర్బంధంలో ఉంచినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపారు.
మరోవైపు అండర్ గ్రౌండ్ లో ఉన్న  జమాత్ చీఫ్ మౌలానా సాద్ ను న్యూల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో కరోనావైరస్ పరీక్ష చేయించుకోవాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ కోరింది.

కరోనావైరస్ పరీక్షలో మౌలానా సాద్ కు నెగిటివ్ వచ్చినట్లు సాద్ యొక్క న్యాయవాది ఏప్రిల్ 26 న తెలిపిన విషయం తెలిసిందే. సాద్ ప్రస్తుతం పలు ఫిర్యాదులను ఎదుర్కొంటున్నాడు. దేశంలో దాదాపు 30శాతం కరోనా కేసులకు కారణమైన తబ్లిగీ జమాత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై సాద్‌పై మార్చి 31 న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మనీలాండరింగ్ కేసు కూడా సాద్ పై నమోదైంది. ఏప్రిల్ 16 న ఈ ఆరోపణల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సాద్ పై కంప్లెయింట్ ఫైల్ చేసింది.