Children Died: 24గంటల్లో ఏడుగురు చిన్నారులు మృతి.. వణికిస్తున్న అడెనోవైరస్ .. అప్రమత్తమైన అధికారులు

అడెనోవైరస్ అనేది ఒక సాధారణ వైరస్. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కండ్లకలక, గ్యాస్ట్రో ఎంటెరిటిస్ తో సహా అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఇది సోకిన వ్యక్తుల దగ్గు, తమ్ముల నుండి వచ్చే తుంపర్లను పీల్చడం ద్వారా వ్యాపిస్తుంది.

Children Died: 24గంటల్లో ఏడుగురు చిన్నారులు మృతి.. వణికిస్తున్న అడెనోవైరస్ .. అప్రమత్తమైన అధికారులు

Children Died

Children Died: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. గడిచిన 24 గంటల్లో ఏడుగురు చిన్నారులు మరణించారు. వీరంతా శ్యాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించినట్లు సీనియర్ ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో గడిచిన వారంరోజుల్లో అడెనోవైరస్ వల్ల 12 మంది చిన్నారులు మరణించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం ఈ మరణాలను ఆడెనోవైరస్ కారణంగా సంభవించినట్లు పేర్కొనలేదు. ఈ సీజన్‌లో తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు సర్వసాధారణమని పేర్కొంది. అడనోవైరస్ ఎక్కువగా 0-2 ఏళ్లలోపు పిల్లలకు సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లల్లో అడెనోవైరస్ సాధారణంగా శ్వాసకోశ, ప్రేగులలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని వైద్యులు తెలిపారు.

Children’s Bone Health : పిల్లల ఎముకల ఆరోగ్యంపై తల్లిదండ్రులు తగిన శ్రద్ధపెట్టటం తప్పనిసరా?

గడిచిన 24 గంటల్లో కోల్‌కతాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐదుగురు, బంకురా సమ్మిలానీ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులు మరణించారు. కోల్‌కతాలోని బీసీ రాయ్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో బుధవారం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో మరణించిన ఇద్దరు పిల్లలకు జ్వరం, శ్వాస ఆడపకపోవటం వంటి లక్షణాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. హౌరాకు చెందిన ఒకరి వయస్సు 22 రోజులు, చుంచురాకకు చెందిన మరొక చిన్నారికి ఏడు నెలలు. అయితే, అడెనోవైరస్ లక్షణాలు ఉన్న వారి నమూనాలను పరీక్షకోసం పంపించామని, ఫలితాల కోసం వేచి చూస్తున్నామని వైద్య అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తున్న అడెనోవైరస్ అంటు వ్యాధి అని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. ప్రస్తుత పరిస్థితి కాలానుగుణ పెరుగుదల తప్ప మరొకటి కాదని ప్రభుత్వం తెలిపింది. అడెనోవైరస్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల సంఖ్య ఇప్పటికే తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం వెల్లడించింది.

అడెనోవైరస్ అంటే ఏమిటి?

అడెనోవైరస్ అనేది ఒక సాధారణ వైరస్. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కండ్లకలక, గ్యాస్ట్రో ఎంటెరిటిస్ తో సహా అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఇది సోకిన వ్యక్తుల దగ్గు, తమ్ముల నుండి వచ్చే తుంపర్లను పీల్చడం ద్వారా వ్యాపిస్తుంది. దీని లక్షణాలు వైరస్ రకాన్ని బట్టి మారుతుంటాయి. ఒక్కోసారి అతిసారం, వాంతులు ఉండొచ్చు. అడెనోవైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే న్యుమోనియాకు దారితీస్తుంది. బలవర్ధకమైన ఆహారం తీసుకోవటం, రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండొచ్చు. ఇదిలాఉంటే ఈ అడెనోవైరస్ ను నియంత్రించాలంటే.. సబ్బు నీటితో తరచు చేతులను శుభ్రం చేసుకోవాలి. అనారోగ్యంతో ఇబ్బందుపడుతున్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండొద్దు. అడెనోవైరస్ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా దూరంగా ఉండాలి. అంతేకాక, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.