కరోనా ఆసుపత్రిలో మంటలు..8 మంది సజీవదహనం

  • Published By: madhu ,Published On : August 6, 2020 / 09:37 AM IST
కరోనా ఆసుపత్రిలో మంటలు..8 మంది సజీవదహనం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత ఇలాఖా గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. 8 మంది సజీవ దహనమయ్యారు. అహ్మదాబాద్ లోని నవరంగ పూర్ శ్రేయ్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.



సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు. శ్రేయ్ ఆసుపత్రిలో ఐసీయూలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. 2020, ఆగస్టు 06వ తేదీ గురువారం తెల్లవారుజామున మంటలు వ్యాపించాయి.

అప్పటికే అందరూ గాఢ నిద్రలో ఉండడంతో ప్రమాదం ఎవరికీ తెలియదు. మంటల్లో చిక్కకున్న 8 మంది…సజీవ దహనమయ్యారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.



మోడీ దిగ్ర్భాంతి : – 
ఘటనపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు, వెంటనే అధికారులు మెరుగైన చికిత్స చేయాలని ఆదేశించారు. PMNRF కింద…చనిపోయిన కుటుంబసభ్యులకు రూ. 2 లక్షలు, రూ. 50 వేలు క్షతగాత్రులకు పరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.