Man Distributes Panipuris: కూతురు పుట్టిన రోజున లక్ష పానీపూరీలు పంపిణీ చేసిన వ్యాపారి.. ఆడ పిల్లల గురించి భలే చెప్పాడు..

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ తండ్రి తన కూతురు పుట్టిన రోజును వినూత్న రీతిలో నిర్వహించాడు, ఉచితంగా లక్ష పానీపూరీలను స్థానికులకు అందించాడు. అంతేకాక ఆడ పిల్లలకు చదువు చెప్పించడం ఎంత ముఖ్యమో వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు.

Man Distributes Panipuris: కూతురు పుట్టిన రోజున లక్ష పానీపూరీలు పంపిణీ చేసిన వ్యాపారి.. ఆడ పిల్లల గురించి భలే చెప్పాడు..

panipuri

Man Distributes Panipuris: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ తండ్రి తన కూతురు పుట్టిన రోజును వినూత్న రీతిలో నిర్వహించాడు. కోలార్‌ ప్రాంతానికి చెందిన అంచల్ గుప్తా దంపతులకు గతేడాది పాప పుట్టింది. గుప్తాకు ఆడ పిల్లలంటే ఎంతో ఇష్టం. వారుండే ఇళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని అంటుంటాడు. గతేడాది కూతురు పుట్టిన సందర్భంగా స్థానికులకు పానీపూరీ అందించి తన సంతోషాన్ని పంచుకున్నాడు. బుధవారం మొదటి సంవత్సరం పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు.

Janmashtami: లండన్‌లో భార్యతో కలిసి గుడికి వెళ్ళిన రిషి సునక్.. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నానని ట్వీట్

తన కుమార్తె అనోఖికి సంవత్సరం నిండిన సందర్భంగా ‘బేటీ బచావో, బేటీ పఢావో’ (ఆడపిల్లలను పోషించండి. వారికి చదువు చెప్పండి) అనే సందేశంతో 1.01 లక్షల పానీ పూరీలను ఉచితంగా అందించారు. బుధవారం ఏరియాలోని బంజరీ మైదాన్‌లో పెద్ద టెంట్ కింద 21 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఆడపిల్లలను చదివించాల్సిన అవసరం గురించి సందేశాన్ని ఇస్తూ కూతురు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఖర్చు గురించి తాను బాధపడటం లేదని గుప్తా చెప్పారు.

తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఆడ పిల్లలను చదివించాలని మంచి సందేశాన్ని ప్రచారం చేసినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విటర్ వేదికగా గుప్తాను అభినందించారు. అంతేకాక స్థానిక ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ  పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ప్రశంసించారు.