పారిశుద్ధ్య కార్మికుడు చనిపోతే రూ. కోటి ఎక్స్ గ్రేషియా : ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఆప్

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

  • Published By: veegamteam ,Published On : February 4, 2020 / 10:49 AM IST
పారిశుద్ధ్య కార్మికుడు చనిపోతే రూ. కోటి ఎక్స్ గ్రేషియా : ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఆప్

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఢిల్లీలో ప్రతి కుటుంబాన్ని సంపన్న కుటుంబంలా తీర్చిదిద్దేలా ఎన్నికల మేనిఫెస్టో రూపొందించినట్లు డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ప్రకటించారు. ఢిల్లీని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేలా తాము పనిచేస్తామని తెలిపారు.

ఫిబ్రవరి 8న ఎన్నికలు
2020, ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 

మేనిఫెస్టోలోని అంశాలు..

  • నాణ్యమైన వైద్యం, విద్య, శుద్దమైన తాగునీరందించడం, 24 గంటల విద్యుత్‌ సరఫరా
  • ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల సరఫరా చేయడం 
  • 10 లక్షల మంది వయోవృద్ధులకు ఉచిత తీర్థయాత్ర సౌకర్యం కల్పించడం 
  • పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉండగా చనిపోతే వారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా
  • ప్రజలకు 24 గంటలు మార్కెట్లు అందుబాటులో ఉంచటం (పైలట్‌ ప్రాజెక్టు)