ABP Cvoter Survey : 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు బీజేపీకే..!

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే చేసింది. సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. 5 రాష్ట్రాలకుగాను

ABP Cvoter Survey : 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు బీజేపీకే..!

Abp Cvoter Survey

ABP Cvoter Survey : వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే చేసింది. సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. 5 రాష్ట్రాలకుగాను నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే గెలుస్తుందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే తేల్చింది. 2022లో ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఒక్క పంజాబ్ తప్ప మిగతా రాష్ట్రాలన్నింటిలో బీజేపీనే అధికారం చేపడుతుందని ఈ సర్వే జోస్యం చెప్పింది. అలాగే పంజాబ్‌లో అంతర్గత కలహాలతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు తెలిపింది.

యూపీలో మళ్లీ కమలమే..
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రాబల్యం కొద్దిగా తగ్గిందని తెలిపిన ఈ సర్వే.. దీని వల్ల ప్రభుత్వంలో మార్పు మాత్రం రాబోదని చెప్పింది. గతంతో పోల్చుకుంటే 60 సీట్లు బీజేపీ కోల్పోతుందని, మొత్తం మీద 259 నుంచి 267 సీట్లు గెలుస్తుందంది. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ)కి 109 నుంచి 117 సీట్లు వస్తాయని, బీఎస్పీ కేవలం 12 నుంచి 16 సీట్లు మాత్రమే గెలుస్తుందని తెలిపింది. అదే సమయంలో మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రం 3 నుంచి 7 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించింది.

Defence Jobs : పది పాస్ అయితే చాలు, రక్షణశాఖలో ఉద్యోగాలు

గోవా పీఠం మళ్లీ బీజేపీకే..
గోవా పీఠం మళ్లీ బీజేపీకే దక్కనుందని ఈ సర్వే తెలిపింది. బీజేపీ సుమారు 39.4 శాతం ఓట్లతో అధికారం నిలబెట్టుకుంటుందని చెప్పింది. ఇక్కడ ఆప్‌కు 22.2 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 15.4 శాతం ఓట్లు మాత్రమే పడతాయని వివరించింది. సీట్ల విషయానికొస్తే.. బీజేపీ 22 నుంచి 26, ఆప్‌ 4 నుంచి 8, కాంగ్రెస్‌ 3 నుంచి 7 స్థానాల్లో గెలుస్తాయంది.

మణిపూర్‌లో కూడా బీజేపీదే..
మణిపూర్‌లో కూడా బీజేపీనే ఆధిక్యంలో నిలుస్తుందని ఏబీపీ సీ-ఓటర్ సర్వే స్పష్టంచేసింది. ఇక్కడ బీజేపీకి 40.5 శాతం ఓట్లు పడతాయని ఊహించింది. కాంగ్రెస్ ఈసారి 34.5 శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితమవుతుందని చెప్పింది. ఇక్కడ బీజేపీకి 32 నుంచి 36 సీట్లు, కాంగ్రెస్‌కు 18 నుంచి 22 సీట్లు వస్తాయని తెలిపింది.

Jagananna Vidya Deevena : హైకోర్టు కీలక తీర్పు, ఇకపై డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకే

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో బీజేపీ ప్రాభవం తగ్గడంతో 11 సీట్లు కోల్పోయే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. ఇక్కడ బీజేపీ కూటమికి 46 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు 21 సీట్లు వస్తాయని వివరించింది.

అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ హవా సాగిస్తుందని ఈ సర్వే జోస్యం చెప్పింది. ప్రస్తుతం ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఈసారి 38 నుంచి 46 సీట్లకే పరిమితం అవుతుందని, ఆప్ మాత్రం 51 నుంచి 57 వరకూ సీట్లు గెలుచుకుంటుందంది. అంటే ఇక్కడ ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించనుందన్నమాట.