Air Pollution : ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం..ఫిజికల్ స్కూల్స్ మూసివేత, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

ఢిల్లీలో వాయుకాలుష్యం కొనసాగుతోంది. ఢిల్లీ వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పీఎం 2.5 పై గాలి నాణ్యత సగటున 331 పాయింట్లు. ఢిల్లీలో కాలుష్య ప్రభావంతో ఫిజికల్ స్కూల్స్ మూసివేశారు.

Air Pollution : ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం..ఫిజికల్ స్కూల్స్ మూసివేత, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

Air Pollution

physical schools closed for a week : ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. ఢిల్లీ వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పీఎం 2.5 పై గాలి నాణ్యత సగటున 331 పాయింట్లుగా ఉంది. ఢిల్లీలో కాలుష్య ప్రభావంతో వారం రోజుల పాటు ఫిజికల్ స్కూల్స్ మూసివేశారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అమలవుతోంది. ప్రైవేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సహించాలని యాజమాన్యాలను ఢిల్లీ ప్రభుత్వం కోరింది.

వర్క్ ఫ్రమ్ హోం కారణంగా రోడ్లపై వాహనాలు తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే 17 తేదీ వరకు భవన నిర్మాణ పనులను ఢిల్లీ ప్రభుత్వం నిలిపివేసింది. వృద్ధులు, చిన్నారులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు రావద్దని నిపుణులు సంచించారు.

TRS MLC Candidates : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

దీపావళి సందర్భంగా ప్రజలు టపకాయలు కాల్చడం, ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలను కాల్చడంతో భారీగా వాయు కాలుష్యం పెరిగింది. కళ్ళ మంటలు, గొంతు నొప్పితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో పెరిగిన దుమ్ము-ధూళి, కాలుష్య కారకాల శాతంతో రోడ్లపై విజబులిటీ తగ్గింది.

ఢిల్లీలో వాయుకాలుష్య నియంత్రణపై ఇవాళ కేంద్రం అత్యవసర సమావేశం అయింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై ఢిల్లీ, హర్యానా, యూపీ, పంజాబ్ రాష్ట్రాలతో కేంద్రం చర్చిస్తోంది. ఈ సమావేశంలో ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్ ముఖ్యకార్యదర్శులు, కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Delhi Air Pollution : ఢిల్లీలో వాయుకాలుష్య నియంత్రణపై కేంద్రం అత్యవసర సమావేశం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైమరొకరు ఆరోపణలు చేసుకోవడంమాని కాలుష్యాన్ని నియంత్రించాలని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించిన విషయం తెలిసిందే. ఢిల్లీ కాలుష్యానికి నిర్మాణాల దుమ్ము, పరిశ్రమలు, వాహన కాలుష్యం ప్రధాన కారణంగా ఉన్నాయి.

కలుష్య కట్టడికి ఏ పరిశ్రమలు మూసేయాలి? వాహనాలను ఎలా నియంత్రించాలి? ఏ విద్యుత్ ప్లాంట్లు మూసేయాలి? మూసేస్తే ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లు ఏంటి? ఇవన్నీ సాయంత్రం లోగా తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్రాలను ఆదేశించింది. వాయు కాలుష్య కట్టడికి అత్యవసరంగా తీసుకునే చర్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయంత్రం సుప్రీంకోర్టుకు తెలపనున్నాయి.