Allahabad Court : గడ్డం పెంచుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదు

పోలీస్ డిపార్టుమెంటులో ప‌నిచేస్తూ గ‌డ్డం పెంచుకోవ‌డం అనేది రాజ్యంగం క‌ల్పించిన హ‌క్కు కాద‌ని అల‌హాబాద్ హైకోర్టు ప‌రిధిలోని ల‌క్నో బెంచ్ స్ప‌ష్టంచేసింది.

Allahabad Court : గడ్డం పెంచుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదు

Allahabad Court

Allahabad Court :  పోలీస్ డిపార్టుమెంటులో ప‌నిచేస్తూ గ‌డ్డం పెంచుకోవ‌డం అనేది రాజ్యంగం క‌ల్పించిన హ‌క్కు కాద‌ని అల‌హాబాద్ హైకోర్టు ప‌రిధిలోని ల‌క్నో బెంచ్ స్ప‌ష్టంచేసింది. కొద్దీ నెలలక్రితం యూపీ ప్రభుత్వం పోలీస్ శాఖలో పనిచేసేవారు గడ్డం పెంచుకోవడంపై నిషేధం విధించింది. గడ్డం పెంచుకొని వచ్చిన ఓ కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ ఓ కానిస్టేబుల్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం పై వ్యాఖ్య చేసింది. ఆ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించింది. అదేవిధంగా కానిస్టేబుల్ స‌స్పెన్ష‌న్ విష‌యంలో జోక్యం చేసుకోవ‌డానికి కూడా న్యాయ‌స్థానం నిరాక‌రించింది.

కాగా యోధ్య జిల్లాలోని ఖందాస పోలీస్‌స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేసే మ‌హ్మ‌ద్ ఫ‌ర్మాన్ గ‌డ్డం పెంచుకుని విధులకు హాజ‌రుకావ‌డంతో ఆయోధ్య డీఐజీ అత‌డిని విధుల నుంచి తొల‌గించారు. ఈ నేపథ్యంలోనే అతడు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై మంగళవారం ల‌క్నోలోని జ‌స్టిస్ రాజేష్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నం ఇవాళ విచార‌ణ జ‌రిపి.. ఈ తీర్పు వెలువరించింది.

కేసు వాదన

గ‌డ్డం పెంచుకోవ‌డం అనేది త‌మ‌కు రాజ్యంగం క‌ల్పించిన‌ మ‌తస్వేచ్ఛ హ‌క్కు కింద‌కు వ‌స్తుంద‌ని, తాను ముస్లిం సూత్రాల‌కు లోబ‌డి గ‌డ్డం పెంచుకున్నాన‌ని పిటిష‌న‌ర్ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. కానీ, యూపీ పోలీస్ రూల్స్ ప్ర‌కారం గ‌డ్డం పెంచుకోవ‌డంపై నిషేధం ఉన్న‌ద‌ని ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ వాధించారు. రెండు వ‌ర్గాల వాద‌న‌లు విన్న రాజేస్ సింగ్ చౌహాన్ తాజా తీర్పు వెలువ‌రించారు.