Gen Bipin Rawat : తాలిబన్ల వేగం ఆశ్చర్యపరిచింది..త్రివిధ దళాధిపతి

అఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై త్రిదళాధిపతి జనరల్ బిపిన్​ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Gen Bipin Rawat : తాలిబన్ల వేగం ఆశ్చర్యపరిచింది..త్రివిధ దళాధిపతి

Rawat

Gen Bipin Rawat అఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై త్రిదళాధిపతి జనరల్ బిపిన్​ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-భారత్​ భాగస్వామ్యం 21వ శతాబ్ద భద్రతపై అబ్జ‌ర్వ‌ర్ రీస‌ర్చ్ ఫౌండేష‌న్ (ఓఆర్ఎఫ్‌) నిర్వహించిన కార్యక్రమంలో యూఎస్ ఇండో ప‌సిఫిక్ క‌మాండ్ అడ్మిర‌ల్ జాన్ అక్విలినోతో కలిసి పాల్గొన్న బిపిన్ రావత్ మాట్లాడుతూ..అప్గానిస్తాన్​ నుంచి భారత్​కు ఉగ్రవాదం వ్యాపిస్తుందని మేం ఆందోళన చెందాం. అందుకే మేం ముందస్తుగా ఆ సవాలును ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాం. కొన్ని నెలల ముందు నుంచే అప్ఘానిస్తాన్​లో జరగబోయే పరిణామాలను అంచనా వేస్తూ వచ్చినట్లు రావత్ తెలిపారు.

అప్ఘానిస్తాన్​ను తాలిబన్లు ఆక్రమించుకుంటారనే విషయాన్ని భారత్​ ముందుగానే ఊహించింది. అయితే సమయం మాత్రమే మారింది. తాలిబ‌న్లు ఊహించ‌ని వేగంతో అఫ్ఘానిస్తాన్‌ను ఆక్ర‌మించేశార‌ని, అది కొంత ఆశ్చ‌ర్యానికి గురి చేసిన‌ట్లు రావత్ చెప్పారు. దీని గ‌మ‌నిస్తే, గ‌త 20 ఏళ్ల‌లో తాలిబ‌న్లు త‌మ ప‌ట్టుకోల్పోలేద‌ని తెలుస్తోంద‌న్నారు.

20 ఏళ్ల క్రితం తాలిబన్లు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారని రావత్ పేర్కొన్నారు. తాలిబన్ల భాగస్వామ్యులు మాత్రమే మారారు తప్ప ఇంకా ఏమీ మారలేదన్నారు. తాలిబ‌న్లు ఒక‌వేళ ఆఫ్ఘ‌న్ దాటి వికృతాల‌కు పాల్ప‌డితే, అలాంటి ఘ‌ట‌న‌లు ఇండియాలో చోటుచేసుకుంటే, వాటికి ధీటైన బ‌దులిస్తామ‌ని రావత్ సృష్టం చేశారు.

క్వాడ్ దేశాలు ఉగ్ర‌వాదాన్ని అడ్డుకునేందుకు మ‌రింత స‌హ‌కారాన్ని పెంపొందించుకోవాల‌న్నారు. ఇండో పసిఫిక్​, అఫ్గాన్ పరిస్థితిని ఒకటే కోణంలో చూడకూడదని.. అవి రెండు విభిన్నమైన అంశాలన్నారు. ఈ రెండు ప్రాంతీయంగా భద్రతా సవాళ్లను విసురుతాయని,. కానీ, అవి రెండు విభిన్నమైన సరళరేఖలన్నారు. అవి రెండు ఎప్పటికీ కలవవని రావత్​ తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ సహాకారం కీలకం అని పేర్కొన్నారు.