Amarinder Singh : సోనియా గాంధీతో పంజాబ్ సీఎం భేటీ

పంజాబ్ కాంగ్రెస్‌లో కుమ్ములాటల వేళ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీలోని ఆమె నివాసంలో మంగళవారం కలిశారు.

Amarinder Singh : సోనియా గాంధీతో పంజాబ్ సీఎం భేటీ

Captin

Amarinder Singh పంజాబ్ కాంగ్రెస్‌లో కుమ్ములాటల వేళ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీలోని ఆమె నివాసంలో మంగళవారం కలిశారు. సుమారు గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. అయితే సీఎం నిర్ణయాలపై తరచూ విమర్శలు చేస్తుండే మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ గత వారం ఢిల్లీలో రాహుల్,ప్రియాంకని కలిసిన కొద్ది రోజులకే అమరీందర్ సింగ్ ఢిల్లీ వెళ్లి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవడం ప్రాధాన్యత సంతరించకుంది.

అయితే వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు,పార్టీ బలపేతంపై చర్చించేందుకే సోనియాను కలిసినట్లు సమావేశం అనంతరం మీడియాతో అమరీందర్ సింగ్ తెలిపారు. సిద్ధూ గురించి మాట్లాడేందుకు తాను ఢిల్లీకి రాలేదన్నారు. పార్టీ అంతర్గత విషయాలు, పంజాబ్ అభివృద్ధిపై సోనియాతో చర్చించినట్లు చెప్పారు. పంజాబ్ విషయంలో సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు. ఇదే విషయాన్ని భేటీ సమయంలో సోనియా గాంధీతో చెప్పినట్లు అమరీందర్ తెలిపారు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని కెప్టెన్ చెప్పారు.