Vacant Posts : కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 8.72 లక్షల ఖాళీలు

కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ డిపార్ట్మెంట్లలో దాదాపు 8.72 లక్షల ఖాళీ పోస్ట్ లు ఉన్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్​ తెలిపారు.

Vacant Posts : కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 8.72 లక్షల ఖాళీలు

Jitendra

Vacant Posts కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ డిపార్ట్మెంట్లలో దాదాపు 8.72 లక్షల ఖాళీ పోస్ట్ లు ఉన్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్​ తెలిపారు. మార్చి 2,2020 నాటికి సేకరించిన డేటా ప్రకారం.. ప్రభుత్వ విభాగాల్లో మొత్తం సామర్థ్యం 40,04,941 మంది కాగా, ప్రస్తుతం 31,32,698 మంది సిబ్బంది ఉన్నట్లు రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

గడిచిన ఐదేళ్లలో(2016-17 To 2020-21) మూడు ప్రధాన నియామక ఏజెన్సీల ద్వారా సిబ్బంది నియామక ప్రక్రియను చేపట్టినట్లు మంత్రి తెలిపారు. యూనియన్​ పబ్లిక్​ సర్వీస్ కమిషన్​(UPSC) ద్వారా 25,267 మందిని, స్టాఫ్​ సెలక్షన్ కమిషన్(SSC)ద్వారా 2,14,601 మందిని, రైల్వే రిక్యూట్​మెంట్ బోర్డులు(RRBs) ద్వారా 2,04,945 మంది అభ్యర్థులను నియమించినట్లు జితేంద్ర సింగ్ చెప్పారు.