Rajasthan: యూటర్న్ తీసుకున్న అశోక్ గెహ్లాట్.. సచిన్ పైలట్‭తో ఇక వైరం లేనట్టేనా?

ఇది జరిగిన నాలుగైదు రోజులకు ఇద్దరు నేతలు అభివాదం చేస్తూ కనిపించారు. అనంతరం గెహ్లాట్ ఎలాంటి వ్యతిరేక, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా తాజా ఇంటర్వ్యూలో రాజకీయాల్లో అలాంటివి జరుగుతుంటాయంటూ వ్యాఖ్యానించడం వెనుక ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీకి మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి

Rajasthan: యూటర్న్ తీసుకున్న అశోక్ గెహ్లాట్.. సచిన్ పైలట్‭తో ఇక వైరం లేనట్టేనా?

Ashok Gehlot Echoes Sachin Pilot

Rajasthan: చాలా కాలంగా కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్‭పై సందు దొరికితే విమర్శలతో విరుచుకుపడే రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఉన్నట్లుండి శాంతించారు. పైలట్‭ను ముఖ్యమంత్రి పీఠం వైపుకు రాకుండా ఆపేందుకు అవసరమైతే తన ప్రయోజనాల్ని కూడా వదులుకునే ఆయన.. తాజాగా కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరాన్ని గురించి మాట్లాడుతున్నారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇద్దరు నేతలు రాజీకొచ్చారా? లేదంటే గెహ్లాటే యూటర్న్ తీసుకున్నారా? ఇంత మార్పుకు కారణం ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యక్తులంతా ఉమ్మడిగా పోరు చేయాలని, ఆ విషయంలో తానేమాత్రం వెనకడుగు వేయబోనని అన్నారు. పరోక్షంగా సచిన్ పైలట్‭తో కలిసి నడిచేందుకు కూడా సిద్ధమేనన్న సంకేతాల్ని ఆయన పరోక్షంగా ఇచ్చిరు. అయితే కొద్ది రోజుల క్రితమే ‘ద్రోహి’ అంటూ పలుమార్లు పైలట్‭పై ఆయన చేసిన భీకర మాటల దాడి గురించి ప్రస్తావించగా కొన్ని సార్లు రాజకీయాల్లో అలాంటివి జరుగుతుంటాయని, కాకపోతే సమయమే అన్నింటినీ చక్కదిద్దుతుందని అనడం గమనార్హం.

Himachal Government Formation: హిమాచల్‌ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం.. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు

‘‘అలాంటి ఘటనలు రాజకీయాల్లో జరగడం చాలా సహజం. దేన్నైనా సమయం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మా ముందున్న అతిపెద్ద సవాల్ దేశంలోని ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వంపై పోరాడడం. ప్రతి కాంగ్రెస్ నేత, కార్యకర్త అందరూ కలిసి పోరాటం చేయాలి. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతి కాంగ్రెస్ వ్యక్తి గట్టిగా నిలబడాలి’’ అని గెహ్లాట్ అన్నారు. కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ద్రోహులు ముఖ్యమంత్రి కాలేరని తీవ్రంగా వ్యాఖ్యానించిన ఆయన, పైలట్‭ను అడ్డుకుంటానని పరోక్షంగా చెప్పారు. అయితే గెహ్లాట్ ఇంటర్వ్యూ ఇచ్చిన రెండు రోజులకు ఒక ఇంటర్వ్యూలో పైలట్ స్పందిస్తూ ఆ వ్యాఖ్యలు తనను బాగా బాధించాయని, అయితే తాను గతంలోకి వెళ్లదల్చుకోలేదని అన్నారు.

ఇక ఇది జరిగిన నాలుగైదు రోజులకు ఇద్దరు నేతలు అభివాదం చేస్తూ కనిపించారు. అనంతరం గెహ్లాట్ ఎలాంటి వ్యతిరేక, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా తాజా ఇంటర్వ్యూలో రాజకీయాల్లో అలాంటివి జరుగుతుంటాయంటూ వ్యాఖ్యానించడం వెనుక ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీకి మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో పార్టీలో చీలకల వల్ల ఎన్నికల్లో నష్టం జరుగుతుందని, అధిష్టానం వీరి మధ్య సయోధ్య కుదిర్చినట్లు కూడా వినిపిస్తున్నాయి.

PM Modi: అలాంటి రాజకీయాలు చేసే నాయకులను హెచ్చరిస్తున్నా.. ప్రధాని మోదీ