Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్యకు 155 దేశాల నదుల నీటితో అభిషేకం

పాకిస్థాన్ లోని రావి నదితో పాటు 155 దేశాల నుంచి సేకరించిన పవిత్ర నదీ జలాలతో అయోధ్య రాయ్యకు ‘జలాభిషేకం’ నిర్వహించనున్నారు.

Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్యకు 155 దేశాల నదుల నీటితో అభిషేకం

Ayodhya anointed Rama 155 countries river waters

Ayodhya Ram Mandir : అయోధ్యలో శ్రీరాముడి ఆలయం రూపుదిద్దుకుంటోంది. సర్వాంగ సుందరంగా వచ్చే ఏడాదిలో భక్తులకు అయోధ్య రామయ్య దర్శనం ఇవ్వనున్నాడు. ఈక్రమంలో అయోధ్య రాముడి విగ్రహానికి 155 దేశాల్లోని నదుల నుంచి తెప్పించిన నీటితో అభిషేకరం చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ చేతుల మీదుగా ఈ మహత్కార్యం జరుగునుంది.

దీని కోసం ఏప్రిల్ 23న ముహూర్తం నిర్ణయించి 155 దేశాల నుంచి సేకరించిన నదీ జలాలతో రాయ్యకు ‘జలాభిషేకం’ నిర్వహించనున్నారు. ఈ జలాభిషేకరం గురించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ గురువారం (ఏప్రిల్ 6,2023)న వెల్లడించారు. 155 దేశాల్లో భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్ లోని రావి నది నుంచి కూడా నీటిని సేకరించారు.

మణిరామ్‌ దాస్‌ చావ్నీ ఆడిటోరియంలో నిర్వహించే ఈ జలాభిషేకం కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సీఎం ఆదిత్యానాథ్ జల కలష్ పూజలు నిర్వహిస్తారని చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. ఢిల్లీకి చెందిన రామభక్తుడు విజయ్‌ జొలీ నేతృత్వంలోని బృందం 155 దేశాల నుంచి నదీ జలాలను తీసుకొచ్చారు. ఈ జలాలను ఆదిత్యనాథ్‌కు అందజేయగా ఆయన చేతుల మీదుగా జలాభిషేకరం నిర్వహిస్తారని తెలిపారు. పాకిస్థాన్‌లోని రావి నది నుంచి సేకరించిన జలాలను పాక్‌లోని హిందువులు దుబాయ్‌కు పంపగా అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకున్నాయని తెలిపారు.

ప్రపంచ దేశాల నదుల నుంచి తీసుకొచ్చిన నదీ జలాల కలశాలపై ఆయా దేశఆల జెండాలు, వాటి పేర్లు ఉంటాయని.. ఆ నదుల పేర్లు కూడా ఉంటాయని తెలిపారు. ఈ జలాభిషేకం కార్యక్రమంలో పలు దేశాల రాయబారులు కూడా పాల్గొంటారని చంపత్ రాయ్ వెల్లడించారు.

Also Read: గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటగ్యాస్ ధరలు, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు