Bengaluru: ర్యాపిడోకు వ్యతిరేకంగా బెంగళూరులో ఆటో యూనియన్ సమ్మె.. నిలిచిపోయిన 2.10 లక్షల ఆటోలు

బెంగళూరులో 21 ఆటో యూనియన్లకు చెందిన 2.10 లక్షల మంది ఆటోడ్రైవర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి సీఎం బసవరాజు బొమ్మై ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపడుతున్నట్లు ఆటో డ్రైవర్స్ ఆదర్శ్ యూనియన్ అధ్యక్షుడు మంజునాథ్ చెప్పాడు.

Bengaluru: ర్యాపిడోకు వ్యతిరేకంగా బెంగళూరులో ఆటో యూనియన్ సమ్మె.. నిలిచిపోయిన 2.10 లక్షల ఆటోలు

Bengaluru: ర్యాపిడో సేవలకు వ్యతిరేకంగా బెంగళూరు నగరంలో ఆటో డ్రైవర్లు సమ్మె చేపట్టారు. నగరవ్యాప్తంగా సోమవారం ఆటో సేవల్ని నిలిపివేశారు. బెంగళూరులో 21 ఆటో యూనియన్లకు చెందిన 2.10 లక్షల మంది ఆటోడ్రైవర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి సీఎం బసవరాజు బొమ్మై ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపడుతున్నట్లు ఆటో డ్రైవర్స్ ఆదర్శ్ యూనియన్ అధ్యక్షుడు మంజునాథ్ చెప్పాడు.

Steve Smith: అద్భుతంగా క్యాచ్ పట్టిన స్మిత్.. ‘క్యాచ్ ఆఫ్ ద సెంచరీ’ అంటున్న జహీర్ ఖాన్… వీడియో ఇదిగో!

ఆటో డ్రైవర్లు నిరసనకు దిగడానికి కారణం ర్యాపిడో సేవలు. ఇటీవలి కాలంలో ర్యాపిడో బైక్ ట్యాక్సీల కారణంగా బెంగళూరులో ఆటోవాలాలకు వ్యాపారం తగ్గిపోతోంది. ఆటోలు ఎక్కే ప్యాసింజర్లు తగ్గుతున్నారు. ఆటోకంటే ర్యాపిడో బైక్ ట్యాక్సీలు తక్కువ ధరలోనే వస్తుండటంతో చాలా మంది వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు ర్యాపిడో సేవల విషయంలో గుర్రుగా ఉన్నారు. ఇటీవల కొందరు ఆటో డ్రైవర్లు ర్యాపిడో బైక్స్ నడుపుతున్న వాళ్లపై దాడులకు కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా నిరసనలకు దిగారు. ‘‘బెంగళూరు నగరంలో వైట్ బోర్డ్ ఉన్న బైక్స్, స్కూటీలను యజమానులు ట్యాక్సీలుగా నడుపుతున్నారు. ర్యాపిడోతో కలిసి పని చేస్తున్నారు. ఇది చట్ట విరుద్ధం. దీనివల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గుతుంది.

Video Games: అదేపనిగా మొబైల్‌లో గేమ్స్ ఆడుతున్న కొడుకు.. తండ్రి వేసిన శిక్షేంటో తెలుసా?

కోవిడ్ వల్ల నష్టాలపాలైన ఆటో డ్రైవర్లు ర్యాపిడో వల్ల మరింతగా ఇబ్బంది పడుతున్నారు’’ అని మంజునాథ్ అన్నాడు. తమ సమస్యలపై ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యల విషయంలో మూడు రోజుల్లో స్పందించాలని కోరారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఆటో యూనియన్లు సమ్మెకు దిగాయి. సోమవారం అర్ధరాత్రి వరకు సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మె వల్ల బెంగళూరులో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.