Best Earphones : రూ.1000 కంటే తక్కువ రేట్లలో బెస్ట్ ఇయర్‌ఫోన్లు..!

ఇయర్‌ఫోన్లు కొనేటప్పుడు ఏ కంపెనీ, ఏ రేట్లలో తీసుకుంటే బాగుంటుందనే సందేహం కలుగుతుంది. ఇప్పుడు మార్కెట్ లో రూ.1000 కంటే తక్కువ రేట్లలో బెస్ట్ ఇయర్‌ఫోన్లు లభిస్తున్నాయి.

Best Earphones : రూ.1000 కంటే తక్కువ రేట్లలో బెస్ట్ ఇయర్‌ఫోన్లు..!

Best Earphones

Best Earphones in market : ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఫోన్లతో పాటుగా ఇయర్‌ఫోన్స్‌ను అందించేవి. కానీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు కస్టమర్లకు ఇయర్‌ఫోన్లను అందించడం నిలిపివేశాయి. దీంతో కచ్చితంగా సపరేటుగా ఇయర్‌ఫోన్లకు కొనాల్సివస్తుంది.

ఈ క్రమంలో ఇయర్‌ఫోన్లను కొనేటప్పుడు ఏ కంపెనీకి చెందినవి బాగుంటాయి? ఏంత ధరలో ఇయర్‌ఫోన్లను కొనాలి ? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఏ కంపెనీ ఇయర్‌ఫోన్లను తీసుకుంటే బాగుంటుందనే సందేహం కలుగుతుంది.

తక్కువ ధరలో మంచి ఇయర్ ఫోన్స్ దొరికితే బాగుంటుందని అనిపిస్తోంది. ఇప్పుడు మార్కెట్ లో రూ.1000 కంటే తక్కువ రేట్లలో బెస్ట్ ఇయర్‌ఫోన్లు లభిస్తున్నాయి.

బోట్ బాస్‌హెడ్స్ 225
బోట్‌ కంపెనీకి చెందిన క్లాసిక్‌ ఇయర్‌ఫోన్లలో బోట్ బాస్‌హెడ్స్ 225 ఒకటి. చెవులకు బాగా సరిపోయే విధంగా వీటి డిజైన్‌ ఉంటుంది. కేవలం కేవలం రూ. 399లకే లభిస్తాయి.

బోట్‌ బాస్‌ హెడ్స్‌ 242
బోట్‌ బాస్‌ హెడ్స్‌ 242.. ఇయర్‌ఫోన్స్‌ ఐపీఎక్స్‌4 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇన్‌ లైన్‌ మైక్‌తో వస్తుంది. తేలికగా ఉంటాయి. వీటి ధర కేవలం రూ. 399 మాత్రమే.

రియల్‌మీ బడ్స్‌ 2 నియో
రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఇయర్‌ఫోన్లను కూడా అందిస్తోంది. రియల్‌మీ బడ్స్‌ టీపీయూ మెటిరియల్‌తో తయారు చేశారు. రియల్‌మీ బడ్స్ 2 చెవులకు బాగా సరిపోయే విధంగా ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది. స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. వీటి ధర రూ. 399.

జెబీఎల్‌ సీ200ఎస్‌ఐ
సౌండ్‌, అకౌస్టిక్‌ పరికారాల్లో హర్మన్‌ కంపెనీకి చెందిన జెబీఎల్‌ ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఈ ఇయర్‌ఫోన్స్‌ ప్రీమియం సౌండ్‌ క్వాలిటీని అందిస్తుంది. జెబీఎల్‌ సీ200ఎస్‌ఐ ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. ఇది మన్నికైనదిగా ఉంటుంది. వీటి ధర రూ. 749.

బౌల్ట్ ఆడియో ప్రోబాస్ X1-WL
బౌల్ట్ ఆడియో ప్రోబాస్ X1-WL అనేది వైర్‌లెస్ నెక్‌బ్యాండ్. బ్లూటూత్‌ 5.0 ఆధారంగా పనిచేస్తుంది. ఇది 12 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. X1-WL పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 1-2 రోజుల స్టాండ్‌బై టైమ్‌ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా IPX5 రేటింగ్ కలిగి ఉంది. ఇవి మార్కెట్ లో రూ. 849 లభిస్తాయి.