Bihar bridge collapse: బ్రిడ్జి నిర్మాణ కంపెనీకి నోటీసులు పంపిన ప్రభుత్వం, హైకోర్టులో పిల్ దాఖలు

బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్టు తెలిపారు. కూలిపోయిన బ్రిడ్జీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టని అన్న తేజశ్వీ.. నిర్ణీత గడువులోగా వంతెన నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు.

Bihar bridge collapse: బ్రిడ్జి నిర్మాణ కంపెనీకి నోటీసులు పంపిన ప్రభుత్వం, హైకోర్టులో పిల్ దాఖలు

Bihar bridge collapse: బీహార్‌లోని భగల్‭లో గంగా నది మీద నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జీ కూలిపోయిన ఘటనలో ఆ బ్రిడ్జీ నిర్మాణ సంస్థ ఎస్పీ సింగ్లా కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు నిర్మాణ విభాగం సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనితో పాటు ఇదే కేసులో బీహార్ రాజ్య పుల్ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. ఈ సంఘటనపై న్యాయ విచారణ కోరుతూ న్యాయవాది మణి భూషణ్ సెంగార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ద్వారా పాట్నా హైకోర్టు ముందు ఈ విషయం వెల్లడైంది.

Buffalo fight On Lions : సింహం సింగిల్‌గా కాదు గుంపుగా వచ్చినా చుక్కలు చూపించిన గేదె..

పిటిషనర్లు ప్రత్యేకంగా ఎస్పీ సింగ్లా కన్‌స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని అభ్యర్థించారు. బీహార్‌లో ఈ నిర్మాణ సంస్థ చేపట్టిన అన్ని ప్రాజెక్టులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్టు తెలిపారు. కూలిపోయిన బ్రిడ్జీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టని అన్న తేజశ్వీ.. నిర్ణీత గడువులోగా వంతెన నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు.

Odisha Train Smoke: ఒడిశాలో మరో ఘటన.. సికింద్రాబాద్-అగర్తలా రైలులో పొగలు

అయితే ఈ వంతెన కూలడం ఇది రెండోసారి. గతేడాది ఏప్రిల్‌లో కూడా ఇదే తరహాలో పతనమైనప్పటికీ నిర్మాణ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎస్పీ సింగ్లా కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ధోరణిపై ఆందోళనలను రేకెత్తుతున్నాయి. జూన్ 4 ఆదివారం బీహార్‌లోని భాగల్‌పూర్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.