Maoist Letter: రెండు పేజీల లేఖను విడుదల చేసిన మావోలు.. అందులో ఏముంది?

ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో శనివారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకు కాల్పులు జరిగిన విషయం విదితమే. ఈ కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి చెందగా, మావోయిస్టుల వైపు కూడా భారీస్థాయిలో ప్రాణనష్టం జరిగినట్లు crpf అధికారులు తెలిపారు. ఇక ఈ తరుణంలోనే మావోయిస్టులు CRPF కు చెందిన జవాన్ ను బందీగా తీసుకెళ్లారు. తమ వద్ద crpf జవాను బందీగా ఉన్నట్లు 2 పేజీల లేఖను విడుదల చేశారు.

Maoist Letter: రెండు పేజీల లేఖను విడుదల చేసిన మావోలు.. అందులో ఏముంది?

Rajeshwar Sing

Maoist Letterఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో శనివారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకు కాల్పులు జరిగిన విషయం విదితమే. ఈ కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి చెందగా, మావోయిస్టుల వైపు కూడా భారీస్థాయిలో ప్రాణనష్టం జరిగినట్లు crpf అధికారులు తెలిపారు. ఇక ఈ తరుణంలోనే మావోయిస్టులు CRPF కు చెందిన జవాన్ ను బందీగా తీసుకెళ్లారు. తమ వద్ద crpf జవాను బందీగా ఉన్నట్లు 2 పేజీల లేఖను విడుదల చేశారు.

ఈ లేఖను పరిశీలించిన ఛత్తీస్ ఘడ్ పోలీసులు బంధించిన విషయం వాస్తవమే అని నిర్దారించారు. మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న కాశ్మీర్ కు చెందిన రాకేశ్వర్ సింగ్ మన్హాస్ (35) అని ఛత్తీస్ ఘడ్ పోలీసులు వివరించారు. అతడిని విడుదల చెయ్యాలంటే చర్చలకు రావాలని ప్రభుత్వానికి సంకేతాలు పంపారు మావోయిస్టులు.

మావోయిస్టులపై మెరుపు దాడులు చేసేందుకు భద్రతా బలగాలు సిద్దమవుతున్న తరుణంలోనే తమ వద్ద ఓ జవాన్ బందీగా ఉన్నాడని వారు పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే జవాన్ ను వదిలేస్తామని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అలెక్స్ పాల్ మీనన్‌ను 2012లో ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు అపహరించారు.

దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి వారితో చర్చలు జరిపి అతడిని విడిపించింది. ఈ విషయాన్నీ మావోలు తమ లేఖలో పేర్కొన్నారు. 2017లో సుక్మా జిల్లాలోని కిస్తారాం ప్రాంతంలో కెనడియన్ జాతీయుడు జాన్ స్లాజాక్ ను మావోయిస్టులు బంధించారు. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి విడిపించింది. ఇక రాకేశ్వర్ సింగ్ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే అంశం ప్రశ్నార్థకంగానే ఉంది.

Bejawada : కరోనాకు తోడు..బెజవాడ కల్తీకి కేరాఫ్ అడ్రస్, నమ్మలేని కల్తీ నిజాలు

మరోవైపు తన భర్తను సురక్షితంగా తీసుకురావాలి ఆయన భార్య కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంది. రాకేశ్వర్ సింగ్ కూతురు కన్నీటి పర్యంతమవుతుంది. ఆమెను టీవీలో చూసినవారంతా కంటతడి పెడుతున్నారు. రాకేశ్వర్ ను సురక్షితంగా తీసుకురావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. మావోయిస్టులతో చర్చలకు అనుభవం ఉన్న వారిని పంపాలని కోరుతున్నారు.