దేశ సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులకు 170 శాతం జీతాలు పెంచిన కేంద్రం

  • Published By: nagamani ,Published On : June 26, 2020 / 04:57 AM IST
దేశ సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులకు 170 శాతం జీతాలు పెంచిన కేంద్రం

భారత దేశ సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే ఉద్యోగులకు భారీగా జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచింది.

ఇంజనీర్లు, కార్మికులు వంటి పలు శాఖల్లో పనిచేసే ఉద్యోగుల కనీస వేతనాన్ని 170 శాతానికి పెంచింది. రిస్క్ అలవెన్స్ ను 100 నుంచి 170 శాతానికి పెంచింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ఈ వేతనాలు జూన్ 1,2020 నుంచి అమల్లోకి రానున్నాయి. 

జాతీయ హైవేలు..మౌలిక రంగ అభివృద్ది కార్పొరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది.   చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వేతన పెంపు వర్తించనుంది.

Read: బిన్ లాడెన్ అమర వీరుడు ఇమ్రాన్ ఖాన్