Petrol Rate : ఇంధన ధరల తగ్గింపు.. ఖజానాపై రూ. 45,000 కోట్ల భారం!

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం వలన ఖజానాపై రూ.45,000 కోట్ల భారం పడుతుందని జ‌పాన్ బ్రోక‌రేజ్ కంపెనీ నోమురా నివేదిక వెల్ల‌డించింది.

Petrol Rate : ఇంధన ధరల తగ్గింపు.. ఖజానాపై రూ. 45,000 కోట్ల భారం!

Petrol

Petrol Rate : దీపావళి సందర్బంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే.. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఖజానాపై రూ.45,000 కోట్ల భారం పడుతుందని.. ఈ తగ్గింపు కారణంగా ఆర్థిక లోటు 0.3 శాతం పెరుగుతుందని విదేశీ బ్రోకరేజ్ కంపెనీ నోమురా పేర్కొంది.

చదవండి : Petrol – Diesel: పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.12వరకూ తగ్గించిన యూపీ ప్రభుత్వం

సుంకాల తగ్గింపుతో లక్ష కోట్ల రాబడి నష్టం వాటిల్లుతుందని.. నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఆ నష్టం రూ.45,000 కోట్లని నోమురా తెలిపింది. పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు మూలంగా ఆర్ధిక లోటు అంచ‌నా 6.2 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింద‌ని పేర్కొంది.

చదవండి : Vat Petrol : పెట్రోల్‌పై వ్యాట్ తగ్గిస్తున్న రాష్ట్రాలు, మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటీ ?

ఇక బుధవారం ధరలు తగ్గడంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108.20 దిగొచ్చింది. ఇక డీజిల్ ధర రూ. 94.61 దిగొచ్చింది.