ఆ ఐదుగురు భారతీయులు మా దగ్గరే ఉన్నారు…చైనా

10TV Telugu News

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం అరుణాచల్​ప్రదేశ్​లో ఐదుగురు అదృశ్యం అయిన  ఘటనపై ఎట్టకేలకు చైనా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన ఐదుగురు భారత పౌరులు తమ భూభాగంలో కనిపించినట్టు చైనా వెల్లడించింది. భారత సైన్యానికి అందించిన సమాచారంలో చైనా సైన్యం ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు కేంద్రమంత్రి, అరుణాచల్​ప్రదేశ్​ ఎంపీ కిరణ్​​ రిజిజు వెల్లడించారు. ఆ ఐదుగురిని వెనక్కి తీసుకొచ్చే విషయంపై చర్చలు జరుపుతున్నట్టు కిరణ్​​ రిజిజు తెలిపారు.


ఈ మేరకు కిరణ్​​ రిజిజు మంగళవారం ట్వీట్‌ చేశారు. భారత సైన్యం పంపిన హాట్ ‌లైన్ సందేశానికి చైనా పీఎల్‌ఏ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన యువకులు వారి పక్షాన ఉన్నట్లు చైనా ధ్రువీకరించింది. వారిని భారత్‌కు అ‍ప్పగించే ప్రక్రియకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయి అని ట్వీట్‌ లో రిజిజు తెలిపారు. చేశారు.


అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సుబాన్​సిరి జిల్లాలో శుక్రవారం తప్పిపోయిన ఐదుగురు పౌరులు భారత సైన్యానికి పోర్టర్లు, గైడ్లుగా పనిచేస్తున్నారు. మొత్తం ఏడుగురు అదృశ్యం కాగా వారిలో ఇద్దరు తప్పించుకుని వచ్చి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కాగా , సుబాన్​సిరి జిల్లాలో కస్తూరి జింకలను వేటాడేందుకు వెళ్లిన ఆ ఐదుగురిని మెక్​మోహన్​ రేఖ వద్ద చైనా సైన్యం పట్టుకుందని అపహరించిందని భాజపా ఎంపీ తపీర్​ గావ్​ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే.

10TV Telugu News