LPG Cylinder Price: భారీగా తగ్గిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర..

చమురు సంస్థలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ఈ ఏడాది మార్చి1న పెంచాయి. యూనిట్‌పై రూ.350.50 పెరిగాయి. అదేక్రమంలో డొమెస్టిక్ సిలీండర్ ధరను రూ. 50వరకు పెంచాయి.

LPG Cylinder Price: భారీగా తగ్గిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర..

LPG Cylinder Price

LPG Cylinder Price: కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తూ పెట్రోలియం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. 19కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ పై రూ. 171.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే, గృహోపకరణాల ఎల్పీజీ సిలీండర్ల ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ఇంధన ధరలు పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతాయి. గ్యాస్ ధరల విషయానికి వస్తే నెల రోజులకు ఒకసారి మార్పులు చోటు చేసుకుంటాయి.

LPG Cylinder Rates: గుడ్‌న్యూస్.. తగ్గిన కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

తగ్గిన ధర ప్రకారం.. ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1856.50 కాగా, ముంబైలో రూ. 1808.59కి చేరింది. కోల్‌కతా‌లో 1960.50, చెన్నైలో గత నెలలో 2,192గా ఉన్న వాణిజ్య సిలిండర్ ధర తాజా తగ్గుదలతో రూ. 2021 కు చేరుకుంది.

LPG Cylinder Price: సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

చమురు సంస్థలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ఈ ఏడాది మార్చి1న పెంచాయి. యూనిట్‌పై రూ.350.50 పెరిగాయి. అదేక్రమంలో డొమెస్టిక్ సిలీండర్ ధరను రూ. 50వరకు పెంచాయి. అయితే, గత నెల ఏప్రిల్ మొదటి తేదీన కమర్షియల్ గ్యాస్ ధర యూనిట్‌పై రూ.92 తగ్గించాయి. ప్రస్తుతం మే నెలలో కమర్షియల్ సిలీండర్ ధర ఏకంగా రూ. 171.50 తగ్గింది. తాజా తగ్గింపుతో సామాన్యులకు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.