Bengaluru-Mysuru Highway: ప్రారంభించి 6 రోజులు కాలేదు, అప్పుడే చెరువును తలపిస్తున్న ఎక్స్‭ప్రెస్‭వే.. ప్రధానిపై విమర్శలు

అండర్‌బ్రిడ్జిలో నీరు నిలవడం ప్రారంభం కాగానే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మొదటిది నాది.. ఆపై ఏడెనిమిది వాహనాలతో బంపర్-టు-బంపర్ ప్రమాదాలు వరుసగా జరిగాయి. నీరు వెళ్లిపోవడానికి ఇక్కడ అనుకూలంగా లేదు. ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే 10 నిమిషాల్లో ఈ నీటి ఎద్దడిని తొలగిస్తారు. మేము సామాన్యులం కాబట్టి, మమ్మల్ని పట్టించుకోరు

Bengaluru-Mysuru Highway: ప్రారంభించి 6 రోజులు కాలేదు, అప్పుడే చెరువును తలపిస్తున్న ఎక్స్‭ప్రెస్‭వే.. ప్రధానిపై విమర్శలు

Bengaluru-Mysuru Highway: బెంగళూరు-మైసూరు ఎక్స్‭ప్రెస్‭వేను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించి ఆరు రోజులు అయింది. అయితే తాజా వర్షాలకు నీటితో నిండిపోయి చెరువును తలపిస్తోంది. 8,480 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రోడ్డు.. శుక్రవారం రాత్రి రామనగర ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఈ ఎక్స్‭ప్రెస్‭వే మీద అడుగుకు పైగా నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. హైవేపై ఉన్న అండర్‌బ్రిడ్జిలో నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించి హైవేపై చాలా సేపు ట్రాఫిక్ జామ్‌లు చోటుచేసుకున్నాయి.

Himachal Pradesh: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు బంపరాఫర్.. ఏకంగా రూ.50 లక్షల సబ్సిడీ

ఇదే అండర్‌బ్రిడ్జి వద్ద గత ఏడాది కర్ణాటకలో అనూహ్యమైన వర్షాలు కురిసినప్పుడు వరదలు వచ్చాయి. అయితే అత్యవసరాల నిమిత్తం ప్రయాణమైన వారికి అంతరాయం కలగడంపై సదరు వ్యక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ హైవే పూర్తి కాకముందే ప్రారంభించారని కొందరు, సరిగా నిర్మించలేదంటూ మరికొందరు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

Zimbabwe: భూమిలోకి కుంగిపోయిన క్లాస్ రూమ్.. 17 మందికి విద్యార్థులకు గాయాలు

“నా మారుతీ స్విఫ్ట్ కారు నీళ్లతో నిండిన అండర్‌బ్రిడ్జిలో సగం మునిగిపోయింది. అది స్విచ్ ఆఫ్ అయింది, వెనుక నుండి వస్తున్న లారీ నా కారును ఢీకొట్టింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నా కారు మరమ్మతులు చేయించాలని నేను ముఖ్యమంత్రి బొమ్మాయిని అభ్యర్థిస్తున్నాను. ప్రధాని మోదీ హైవేను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి రహదారి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకున్నారా? తన రహదారి, రవాణా మంత్రిత్వ శాఖతో తనిఖీ చేసారా? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మనం బాధపడాలా? వారు భారీ టోల్ రుసుము డిమాండ్ చేస్తారు, ఏమి ప్రయోజనం?” వికాస్ అనే ప్రయాణీకుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు.

Amit Shah: ఎట్టకేలకు అదానీ వ్యవహారంపై స్పందించిన అమిత్ షా

బంపర్‌ టు బంపర్‌ ప్రమాదాల్లో తమ వాహనమే ప్రథమ స్థానంలో నిలిచిందని ఆందోళనకు దిగిన మరో ప్రయాణికుడు నాగరాజు. ఈ ప్రమాదాలకు ఎవరు బాధ్యులని అతడు ప్రశ్నించాడు. ప్రధాని వస్తే 10 నిమిషాల్లో నీటి ఎద్దడిని తొలగిస్తామని చెప్పారు. “అండర్‌బ్రిడ్జిలో నీరు నిలవడం ప్రారంభం కాగానే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మొదటిది నాది.. ఆపై ఏడెనిమిది వాహనాలతో బంపర్-టు-బంపర్ ప్రమాదాలు వరుసగా జరిగాయి. నీరు వెళ్లిపోవడానికి ఇక్కడ అనుకూలంగా లేదు. ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే 10 నిమిషాల్లో ఈ నీటి ఎద్దడిని తొలగిస్తారు. మేము సామాన్యులం కాబట్టి, మమ్మల్ని పట్టించుకోరు” అని నాగరాజు అన్నాడు.

UPI Fraud: కొత్త నెంబర్ నుంచి యూపీఐ ద్వారా మనీ వచ్చిందా? అయితే జాగ్రత్త.. ఎందుకంటే

ప్రధాని మోదీ మార్చి 12న 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు, దీని ద్వారా ప్రయాణ సమయాన్ని మూడు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గించారు. 275 జాతీయ రహదారినే బెంగళూరు-నిడఘట్ట-మైసూరు సెక్షన్ ఈ ప్రాంతంలో ఆరు లేన్లుగా మార్చి ఎక్స్‌ప్రెస్‌వేగా మలిచారు. సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ అన్నారు.