Congress : బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాలు

కేంద్రంలో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. దేశ వ్యాప్త ఉద్యమాలకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనల కమిటీ సమావేశం కానుంది.

Congress : బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాలు

Congress (1)

plan for nationwide movements : 2024 నాటికి కేంద్రంలో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. దేశవ్యాప్త ఉద్యమాలకి కాంగ్రెస్ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనల కమిటీ సమావేశం కానుంది. దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు వ్యూహాలు, అనుసరించాల్సిన విధివిధానాలపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు.

జాతీయ అంశాలపై ఆందోళనలు చేపట్టేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇటీవల కమిటీని ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనల కమిటీకి చైర్మన్‌గా దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. ఈ టీమ్‌లో ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు

UP Election : కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ ?

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, పాలసీలపై దేశ వ్యాప్తంగా నిరసన చేయాలని సోనియా గాంధీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్‌ 20 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలతో కలిసి పెట్రోల్, గ్యాస్‌ ధరల పెంపు సహా పలు అంశాలపై సంయుక్త ఆందోళనలు చేపతామని ప్రకటించింది.

అటు 2024 ఎన్నికల్లో ఎలాగైన అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం.. ఉద్యమాలతోనే NDA సర్కార్‌ను గద్దె దించాలని పావులు కదుపుతోంది. అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది.