Rahul Gandhi: ఇందిరా, రాజీవ్ సహా వాజ్‌పేయికి నివాళులర్పించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. ఈ సందర్భంగా సోమవారం ఢిల్లీలోని గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లతో పాటు బీజేపీ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి స్మృతి స్థల్ వద్ద నివాళులర్పించారు.

Rahul Gandhi: ఇందిరా, రాజీవ్ సహా వాజ్‌పేయికి నివాళులర్పించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ భారత్ జోడో యాత్రకు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు ప్రముఖులు భారత్ జోడో యాత్రలో పాల్గొని రాహుల్‌కు మద్దతు తెలిపారు.

 

భారత్ జోడో యాత్ర ఢిల్లీలో కొనసాగుతున్న సందర్భంగా సోమవారం రాహుల్ గాంధీ పలువురు ప్రముఖుల సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. వీరిలో మాజీ ప్రధాని, బీజేపీ వాజ్‌పేయి కూడా ఉన్నారు. తొలుత ఢిల్లీలోని శక్తిస్థల్‌లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి రాహుల్ నివాళులర్పించారు. అనంతరం వీర్ భూమిలోని రాజీవ్ గాంధీకి, శాంతివనంలోని దేశ మొదటి ప్రధాని జవరహర్ లాల్ నెహ్రూ, రాజ్ ఘాట్ లోని జాతిపిత మహాత్మా గాంధీ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు.

 

అదేవిధంగా విజాయ్ ఘాట్‌లోని మాజీ ప్రధాని లాల్ బహదూర్‌శాస్త్రి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత  బీజేపీ నేత, మాజీ ప్రధాని అటల్ స్మృతి స్థల్ వద్దకు వెళ్లి అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించారు.