ఆ రోజు నేరస్థుడు..ఈ రోజు పవిత్రుడు : బీజేపీకి గోపాల్ ఖంద మద్దుతుపై విమర్శలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 25, 2019 / 10:13 AM IST
ఆ రోజు నేరస్థుడు..ఈ రోజు పవిత్రుడు : బీజేపీకి గోపాల్ ఖంద మద్దుతుపై విమర్శలు

హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు కోసం బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాజీ మంత్రి  గోపాల్ ఖంద మద్దుతు తీసుకోవడాన్ని ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. గోపాల్ ఖంద మద్దతు విషయంలో వరుస ట్వీట్ల ద్వారా బీజేపీని హెచ్చరించారు ఆ పార్టీ సీనియర్ లీడర్ ఉమా భారతి. ఇదే గోపాల్ ఖంద కారణంగా ఓ యువతి,ఆమె తల్లి ఆత్మహత్య చేసుకున్నారని,ఆ కేసు ఇంకా కోర్టులో పెండింగ్ లో ఉందని ఆమె తెలిపారు. గోపాల్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారని తెలిపారు. గోపాల్ అమాయకుడో లేదా నేరస్థుడో సాక్ష్యాల ఆధారంగా కోర్టు నిర్ణయిస్తుందని,అయితే ఎన్నికల్లో గెలిుపు ఆయనను తన నేరాలనుంచి బయటపడేయలేదని ఉమాభారతి అన్నారు. గోపాల్ ఖంద మద్దుతు బీజేపీ తీసుకోవడాన్ని శివసేన కూడా విమర్శించింది. గోపాల్ మద్దుత తీసుకుని హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మూల్యం చేల్లించుకోక తప్పదని విమర్శించింది.

మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా గోపాల్ ఖంద మద్దతును బీజేపీ తీసుకోవడంపై విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీకి అధికారం కావాలా లేక భేటీ బచావ్ కావాలా అని తేల్చుకోవలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. 2012లో ఇదే బీజేపీ గోపాల్ ఖందపై చేసిన వ్యాఖ్యలు గుర్తుచేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను పార్టీ నుంచి తొలగించి ఆయనపై కేసు నమోదుచేసిందని సుర్జేవాలా గుర్తుచేశారు. కానీ ఈ రోజు బీజేపీకి ఆయన ఒక పవిత్రమైన వ్యక్తిగా కనిపిస్తున్నారని విమర్శించారు. హర్యనాను పాలించడానికి బీజేపీ నైతిక హక్కు కోల్పోయిందని ఆయన అన్నారు. ఇద్దరు తప్ప కట్టర్ ప్రభుత్వంలో మంత్రులుగా చేసినవారందరూ ఈ ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు. రాష్ట్రంలో మరోసారి ఆయా రామ్ గయా రామ్ రాజకీయాలకు హర్యానా సాక్ష్యం అని సుర్జేవలా అన్నారు. 

గోపాల్,అతని అనుచరుడు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసి 2012లో మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికాశర్మ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. గోపాల్ కి మరో మహిళతో కూడా అక్రమసంబంధం ఉందని,ఆమెకు ఓ కూతురు కూడా ఉందని గీతికా సూసైడ్ నోట్ తో ఆరోపించింది. దీంతో 2012లో గోపాల్ ఖంద తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. 2014మార్చిలో గోపల్ కు బెయిల్ లభించింది.