హామీలు అలా ఉన్నాయి : కుప్పకూలిన కాంగ్రెస్ వెబ్ సైట్

  • Published By: venkaiahnaidu ,Published On : April 2, 2019 / 02:48 PM IST
హామీలు అలా ఉన్నాయి : కుప్పకూలిన కాంగ్రెస్ వెబ్ సైట్

లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం(ఏప్రిల్-2,2019) మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే పార్టీ మేనిఫెస్టో వెబ్‌ సైట్ కుప్పకూలింది. ట్రాఫిక్ ఎక్కువ కావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మేనిఫెస్టో వెబ్‌సైట్‌ కు ఫుల్ రెస్ఫాన్స్ వస్తోంది.పెద్ద సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. తీవ్రమైన ట్రాఫిక్‌ కు గురైన మా వెబ్‌సైట్‌ ను వెంటనే మీ ముందుకు తీసుకువస్తామని అధికారిక ట్విటర్‌ అకౌంట్ ద్వారా కాంగ్రెస్‌ తెలిపింది. 

2020 మార్చిలోగా 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నరేగా స్కీమ్ కింద అదనంగా వంద రోజుల ఉపాధి కల్పన,నిరుపేదల ఖాతాల్లో ఏడాదికి రూ.72వేలు,రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ వంటి తదితర భారీ హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు.