Covid – 19 : భారత్ లో పెరిగిన కరోనా కొత్త కేసులు, మరణాలు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది.

Covid – 19 : భారత్ లో పెరిగిన కరోనా కొత్త కేసులు, మరణాలు

Covid 19

Covid – 19 : దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 41,965 కొత్త కేసులు వెలుగుచూడగా ఇందులో 70 శాతం కేసులు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో 30,203 కేసులు బయటపడ్డాయి. ఇక తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం 3,28,10,845 కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో కరోనాతో 460 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,39,020 చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 33,964 డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3,19,93,644 కు చేరింది. రికవరీ రేటు 97.51శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,78,181 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.15శాతంగా ఉంది.

టీకా ‘రికార్డ్‌’

ఇదిలా ఉండగా.. టీకా పంపిణీలో భారత్ మరోసారి రికార్డు సృష్టించింది. ఆగస్టు 27న తొలిసారి 24గంటల్లో కోటి డోసులకు పైగా పంపిణీ చేయగా.. మంగళవారం ఆ రికార్డును తిరగరాసింది. మంగళవారం దేశవ్యాప్తంగా 1.33కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు 65.41 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు 50కోట్ల మందికి తొలి డోసు పూర్తిచేయడం విశేషం.