Delhi Police Corona : కరోనా టెర్రర్.. ఒకేసారి వెయ్యి మంది పోలీసులకు కోవిడ్

కరోనావైరస్ మహమ్మారి అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతోంది. దేశ రాజధానిలో కల్లోలం సృష్టిస్తోంది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతున్నారు.

Delhi Police Corona : కరోనా టెర్రర్.. ఒకేసారి వెయ్యి మంది పోలీసులకు కోవిడ్

Delhi Police Corona

Delhi Police Corona : కరోనావైరస్ మహమ్మారి అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కల్లోలం సృష్టిస్తోంది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా ఒకేసారి వెయ్యి మంది పోలీసులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. వీరిలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్ కూడా ఉన్నారు. వైరస్ బాధితులంతా ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నట్లు ఢిల్లీ పోలీస్ యంత్రాంగం తెలిపింది. ఇటు సుప్రీంకోర్టులోనూ 150 మంది ఉద్యోగులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

కోవిడ్​-19 వ్యాప్తితో ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ అస్తానా సిబ్బందికి మార్గదర్శకాలు విడుదల చేశారు. పోలీస్ సిబ్బంది ఫ్రంట్​లైన్​ వారియర్స్​లో భాగం కాబట్టి వైరస్ బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పోలీస్​ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని నిబంధనల్లో సూచించారు.

Samsung Galaxy : శాంసంగ్ గెలాక్సీ కొత్త 5G ఫోన్.. అదిరే ఫీచర్లు.. ధర ఎంతంటే?

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్రభావం భారత్‌లో కనిపిస్తోంది. అనుకున్న దానికంటే శరవేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. గత 10 రోజుల క్రితం దేశవ్యాప్తంగా 50వేల లోపు నమోదైన కరోనా కేసులు ఇప్పుడు లక్ష 50 వేలకు పైగా నమోదవుతున్నాయి.

Ponnaganti Leaves : పోషక విలువల పొన్నగంటి

తాజాగా దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే ఒక లక్షా 79వేల 723 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 146 మంది కోవిడ్ తో చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,23,619 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 4,033కు చేరుకుంది.