దేశవ్యాప్తంగా మరో 12 ఎయిర్ పోర్ట్‌ల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 05:28 AM IST
దేశవ్యాప్తంగా మరో 12 ఎయిర్ పోర్ట్‌ల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు

భారత్ లో దేశవ్యాప్తంగా మరో 12 ప్రాంతాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం (జనవరి 30,2020)నెలకొల్పింది. ఇప్పటికే ఏడు విమానాశ్రయాలలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను నెలకొల్పారు. ఈ క్రమంలో విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ప్రతీ ప్రయాణీకులకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించనున్నారు. వారిని కనీసం రెండు వారాల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంచనున్నారు. 

చైనా నుంచి 830 కరోనావైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయని, 25 మరణాలతో పాటు, గురువారం నాటికి ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది.కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తున్న క్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖ WHO తో సంప్రదించింది. WHO సహకారంతో కరోనా వైరస్ నియంత్రించేందుకు భారత్ అన్ని చర్యలు తీసుకుంటోంది. 

చైనా నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులను ముంబై ఆసుపత్రికి తరలించి నిపుణుల పర్యవేక్షణలో ఉంచామని WHO అధికారి తెలిపారు. కాగా వైరస్ గా వ్యాప్తి చెందే కరోనా లక్షణాలతో హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటలస్ లో ఇద్దరు వ్యక్తులు చికిత్సపొందుతున్నారు.

వారి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించిన వైద్యాధికారులు ఇప్పటికే పూణెకు పంపించారు. గాంధీ హాస్పిటల్ లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమయ్యే కిట్లను కేంద్రప్రభుత్వం హైదరాబాద్ కు పంపించనుంది. దీంతో గాంధీ హాస్పిటల్ కరోనా వైరస్ టెస్ట్ నిర్వాహణకు మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశముందని వైద్యాధికారులు  తెలిపారు.