Covid-19 Crisis : దేశంలో కరోనా సోకింది 2శాతం మందికే.. 98శాతం మందికి ముప్పు

ఇప్పటివరకు దేశ మొత్తం జనాభాలో కేవలం 1.8 శాతం మంది వైరస్‌ సోకిందని, కోవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించగలిగామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇటలీ, బ్రెజిల్, రష్యా జర్మనీ అమెరికా, ఫ్రాన్స్‌తో సహా అనేక ఇతర దేశాల కంటే తక్కువగానే కరోనా వ్యాప్తి ఉన్నట్టు పేర్కొంది.

Covid-19 Crisis : దేశంలో కరోనా సోకింది 2శాతం మందికే.. 98శాతం మందికి ముప్పు

Below 2% Infected, 98% Of India Still Vulnerable, Says Govt

Covid-19 Crisis : ఇప్పటివరకు దేశ మొత్తం జనాభాలో కేవలం 1.8 శాతం మంది వైరస్‌ సోకిందని, కోవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించగలిగామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇటలీ, బ్రెజిల్, రష్యా జర్మనీ అమెరికా, ఫ్రాన్స్‌తో సహా అనేక ఇతర దేశాల కంటే తక్కువగానే కరోనా వ్యాప్తి ఉన్నట్టు పేర్కొంది. అధిక సంఖ్యలో కరోనా కేసులు ఉన్నప్పటికీ జనాభాలో 2 శాతం కంటే తక్కువ మందికి కరోనా సోకినట్టు పేర్కొంది. ఇంకా 98 శాతం జనాభాకు కరోనా ముప్పు పొంచి ఉందని, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ అన్నారు. భారతదేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 25 మిలియన్లను దాటింది. మరణాల సంఖ్య 278,719గా నమోదైంది.

అమెరికాలో 10 శాతం, ఫ్రాన్స్‌లో 9 శాతం, ఇటలీ, బ్రెజిల్, అర్జెంటీనాలో 7 శాతానికి పైగా, టర్కీ, కొలంబియాలో 6 శాతం, జర్మనీలో 4 శాతానికి పైగా జనాభా కరోనా బారినపడినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రష్యాలో 3 శాతానికి పైగా జనాభా వైరస్ బారిన పడింది. గత 15 రోజులుగా యాక్టివ్ కేసులు తగ్గడంతోపాటు పాజిటివిటీ రేటు మే ప్రారంభంలో 21 శాతం నుంచి 16.9 శాతానికి తగ్గినట్టు ప్రభుత్వం తెలిపింది. మే 6న కరోనా కేసులు 4,14,000 దాటగా.. రోజువారీ కేసులతో పోలిస్తే 27 శాతం తగ్గిందని, మహమ్మారి తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆరోగ్య నీతి ఆయోగ్ వి.కె పాల్ అన్నారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి మధ్యకాలం నుంచి దేశంలో వారపు కరోనా టెస్టుల్లో స్థిరమైన ధోరణిని సాధించింది. గత 14 వారాలలో సగటు రోజువారీ టెస్టులు 2.5 సార్లు కంటే ఎక్కువగా ఉన్నాయి. లక్ష కంటే ఎక్కువ యాక్టివ్ కేసులతో ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తం పాజిటివిటీ రేటు తగ్గింది. కానీ, పెరుగుతున్న కేసులతో పాటు కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటి పెరుగుతోంది. ఏప్రిల్ నుంచి తమిళనాడు 24.5 శాతం పాజిటివిటీ నమోదుకాగా.. కరోనా కేసులు భారీగా పెరిగాయి. మూడు వారాల్లో, సిక్కింలో 26 శాతానికి పైగా పాజిటివిటీ రేటుతో కేసులు రెట్టింపు అయ్యాయి.

త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా పాజిటివిటీ రేటు తగ్గుతోంది. పుదుచ్చేరిలో దాదాపు 38 శాతం పాజిటివిటీ రేటు ఉంది. వారం క్రితం 45 శాతం నుండి రోజువారీ కేసులు పెరిగాయి. ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, నాగాలాండ్ ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తంమీద, 26 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు తగ్గుతోంది. గత రెండు వారాలుగా 200 జిల్లాలు రోజువారీ కేసుల తగ్గుదల కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో మరణాలు కూడా తగ్గాయి.