Crusi Drug Case : అమాయకులను అరెస్టు చేశారు..మరో బాంబు పేల్చిన నవాబ్ మాలిక్!

రోజుకో ట్విస్ట్, గంటకో కొత్త ఆరోపణతో ఊహించని మలుపులు తిరుగుతున్న ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్‌ కేసులో మరో కోణం తెరపైకి వచ్చింది..

Crusi Drug Case : అమాయకులను అరెస్టు చేశారు..మరో బాంబు పేల్చిన నవాబ్ మాలిక్!

Nawab Malik

Allegations Of Nawab Malik : రోజుకో ట్విస్ట్, గంటకో కొత్త ఆరోపణతో ఊహించని మలుపులు తిరుగుతున్న ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్‌ కేసులో మరో కోణం తెరపైకి వచ్చింది.. నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో ఆఫీసర్‌ సమీర్‌ వాంఖడేపై రోజుకో సంచలన ఆరోపణ చేస్తున్న ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ మరో బాంబు పేల్చారు.. క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన రైడ్‌లో సమీర్‌ ఇంటర్నేషనల్ డ్రగ్‌ మాఫియా సభ్యులను వదిలేసి.. అమాయకులను అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు.. అంతేగాకుండా వెయ్యి కోట్ల డ్రగ్‌ రాకెట్ బయటపడుతుందనే సమీర్‌ను బీజేపీ వెనకేసుకొస్తుందా అంటూ బీజేపీకి కూడా డ్రగ్ దందాతో సంబంధాలు ఉన్నట్టు చెప్పకనే చెప్పారు నవాబ్‌ మాలిక్‌.

Read More : Oh Madhu Movie: విడుదలకు సిద్ధమైన ‘ఓ మధు’.. ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్!

క్రూయిజ్‌ షిప్‌లో రైడ్ జరిగిన రోజు ఓ ఇంటర్నేషనల్ డ్రగ్‌ మాఫియాకు చెందిన సభ్యుడు తన గర్ల్‌ ఫ్రెండ్‌తో అక్కడే ఉన్నాడని.. సమీర్‌ అతడిని గుర్తించినా కావాలనే వదిలేశాడని నవాబ్‌ ఆరోపించారు. ఆ గడ్డం ఉన్న వ్యక్తి గతంలో తిహార్‌ జైలులో ఉన్నాడని, రాజస్థాన్ జైలులో కూడా శిక్ష అనుభవించడానికి తెలిపారు. సమీర్‌ అతడిని కావాలనే వదిలేసి అమాయకులైన కొందరి వద్ద డ్రగ్స్ పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. అంతేగాకుండా ఎన్సీబీ ఈ అంశంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం కొందరు ఎన్సీబీ అధికారులకు తెలుసన్నారు.. ఎన్సీబీ దర్యాప్తు చేయకపోతే తన వద్ద ఉన్న ఆ వ్యక్తికి సంబంధించిన వీడియోలను రిలీజ్‌ చేస్తానన్నారు.

Read More : Pune Police : కిరణ్ గోసవి అరెస్టు

తన రాజీనామాకు పట్టుపడుతున్న బీజేపీ నేతలపై కూడా సంచలన ఆరోపణలు చేశారు నవాబ్ మాలిక్‌. వెయ్యి కోట్ల డ్రగ్‌ రాకెట్‌ బయటపడుతుందనే బీజేపీ నేతలు సమీర్‌ను వెనకేసుకొస్తున్నారన్నారు నవాబ్‌. మరోవైపు నవాబ్‌ మాలిక్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మహారాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్న ఓ అధికారిని టార్గెట్ చేసి అతడిని విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More : Pan, gutka Ban : పశ్చిమబెంగాల్‌ లో పాన్‌ మసాలా, గుట్కాపై నిషేధం

నవాబ్‌ కొత్తగా చేసిన ఆరోపణలతో ఈ కేసు మరో టర్న్‌ తీసుకోనుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే 25 కోట్ల లంచం డిమాండ్ చేశారంటూ వస్తున్న ఆరోపణలపై సమీర్‌పై ఎన్సీబీ విజిలెన్స్‌ ఎంక్వైరీకి ఆదేశించింది. అయితే అతడికి వ్యతిరేకంగా తగిన ఆధారాలు లభించే వరకు సమీరే దర్యాప్తు అధికారిగా ఉంటారని ఎన్సీబీ తేల్చి చెప్పింది. అదే సమయంలో నవాబ్ ఈ కొత్త ఆరోపణలు తెరపైకి తీసుకొచ్చారు. ఈ డ్రగ్ కేసులో నవాబ్‌ మాలిక్‌ దగ్గరి బంధువును అరెస్ట్ చేసినప్పటి నుంచే తనను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారంటూ ఇప్పటికే సమీర్‌ వాంఖడే తెలిపారు.