Delhi Govt : కరోనా తగ్గుతున్నా ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ పొడిగింపు

దేశ రాజధానిలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినా..లాక్ డౌన్ మరోసారి పొడిగించాలని కేజ్రీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Delhi Govt : కరోనా తగ్గుతున్నా ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ పొడిగింపు

Delhi

Delhi Extend Lockdown : దేశ రాజధానిలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినా..లాక్ డౌన్ మరోసారి పొడిగించాలని కేజ్రీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2021, మే 24వ తేదీ సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..ఢిల్లీ ప్రభుత్వం కరోనా పరిస్థితిపై సమీక్షించింది. మరో వారం రోజుల పాటు పొడిగిస్తే బెటర్ అని సీఎం కేజ్రీవాల్ భావించారు.

2021, మే 31వ తేదీ వరకు పొడిగిస్తున్న ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ..కరోనా సెకండ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గిందన్నారు. కరోనా పాజిటివిటీ రేటు 2.5 శాతానికి తగ్గినట్లు, ఆక్సిజన్, బెడ్లు ఇతర సమస్యలు అధిగమించడం జరిగిందన్నారు. అయితే..ప్రస్తుతం ఢిల్లీలో వ్యాక్సిన్ కొరత నెలకొందని, కేంద్రం, వ్యాక్సిన్ కంపెనీలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారాయన. వ్యాక్సినేషన్ ఆలస్యం అయితే..థర్డ్ వేవ్ ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నెల 31 తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తామని తెలిపారు సీఎం కేజ్రీవాల్.

ఢిల్లీలో లాక్‌డౌన్‌ 2021, మే 17వ తేదీతో సోమవారం లాక్ డౌన్ ముగియనుంది. అయితే..లాక్‌డౌన్‌ను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2021, మే 24వ తేదీ సోమవారం ఉదయం 5 గంటల వరకూ లాక్‌డౌన్ కొనసాగనుంది. అయితే..మరోసారి లాక్ డౌన్ పొడించారు సీఎం కేజ్రీవాల్.దేశ రాజధానిలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినా..లాక్ డౌన్ మరోసారి పొడిగించాలని కేజ్రీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Read More : Hailstorm: విషాదం: వడగండ్ల వానకు 21 మంది మృతి