Delhi : ఢిల్లీని కమ్మేసిన దుమ్ము, ధూళి.. భారీగా పెరిగిన వాయు కాలుష్యం

దుమ్ము, ధూళి కారణంగా ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం పెరిగింది. దీంతో గాలి నాణ్యత తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 134 పాయింట్లుగా ఉంది.

Delhi : ఢిల్లీని కమ్మేసిన దుమ్ము, ధూళి.. భారీగా పెరిగిన వాయు కాలుష్యం

Delhi Dust

Delhi Dust : దేశ రాజధాని ఢిల్లీని దుమ్ము, ధూళి కమ్మేసింది. రాజస్థాన్‌లో తుఫాను కారణంగా ఢిల్లీపై దుమ్ము, ధూళి ప్రభావం పడింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లోని పలు ప్రాంతాలపై తదుపరి 3-4 రోజుల పాటు రాజస్థాన్ తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర రాజస్థాన్‌లో దుమ్ము తుఫాను, తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

దుమ్ము, ధూళి కారణంగా ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం పెరిగింది. దీంతో గాలి నాణ్యత తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 134 పాయింట్లుగా ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఉదయం 6 గంటల నుంచి దుమ్ము, ధూళితో కూడిన బలమైన గాలులు వీస్తున్నాయి.

High Temperatures In AP: నిప్పుల కొలిమి..! అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

ఢిల్లీ విమానాశ్రయంలో విజిబిలిటీ 1,100 మీటర్ల వరకు పడిపోయింది. మంగళవారం, బుధవారం ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దుమ్ము, ధూళి ప్రభావంతో ఢిల్లీలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. మరోవైపు ఢిల్లీలో గత ఐదు రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి.

దీంతో నగరంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు స్వల్పంగా మేఘాలు ఏర్పడనున్నాయని, కొన్ని చోట్ల చిరు జల్లులు పడే అవకాశం ఉండడంతో రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. ఆదివారం వరకు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.